Dil Raju : పదవి చేపట్టడంతోనే సమస్యల పై దృష్టి పెట్టిన దిల్ రాజు.. తెలుగు సినీ పరిశ్రమ..!
ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో గెలిచిన అధ్యక్షత పదవి చేపట్టడంతోనే దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ సమస్యల పై దృష్టి సారించాడు.

Telugu Film Chamber President Dil Raju meeting with board members
Dil Raju : టాలీవుడ్ లో ఈ ఏడాది ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ హోరాహోరీగా జరిగాయి. ప్రస్తుత స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ ప్యానెల్, ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన సి కళ్యాణ్ ప్యానల్ మధ్య ఈ పోటీ జరిగింది. ఇక ఈ పోటీలో దిల్ రాజు ప్యానల్ మంచి సూపర్ మెజారిటీతో గెలుపుని సొంతం చేసుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ‘దిల్ రాజు’, సెక్రటరీగా ‘దామోదర్ ప్రసాద్’ పదవిని చేపట్టారు. ఇక వీరిద్దరిని.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ PSN దొర, కోశాధికారి వి సురేష్ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
OG Movie : మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో పవన్ కళ్యాణ్.. నెట్టింట పిక్స్ వైరల్..!
ఇక అధ్యక్షత పదవి చేపట్టడంతోనే దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ సమస్యల పై దృష్టి సారించాడు. ఈరోజు జులై 31 మధ్యాహ్నం 3 గంటల 6నిముషాలకు అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న దిల్ రాజు.. వెంటనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఈసీ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ సమస్యల పై చర్చలు జరిపారు. సుదీర్ఘ కాల సమస్యల పరిష్కారం దిశగా దిల్ రాజు చర్చ జరిపించారు. త్వరలోనే యాక్షన్ లోకి కూడా దిగి.. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం వైపుగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగనున్నారు.
NTR 100 Years : “అన్న ఎన్. టి. ఆర్. విగ్రహం భావితరాలకు స్ఫూర్తి”.. టి .డి .జనార్దన్
కాగా ఈ ఎన్నికల్లో దిల్ రాజు ఇచ్చిన హామీల విషయానికి వస్తే.. ఛాంబర్ బైలాలో కొన్ని మార్పులు తీసుకోని వస్తానని వెల్లడించాడు. అలాగే ఎగ్జిబిటర్లు ఎదురుకుంటున్న సినిమా టికెట్ రేట్స్ మరియు ఇతర సమస్యలు పై రెండు ప్రభుత్వాలతో చర్చించి పక్కా ప్రణాళిక సిద్ధం చేయిస్తాని చెప్పుకొచ్చారు. మరి ఇచ్చిన హామీలను, ప్రస్తుత ఉన్న సమస్యలు అన్నిటిని దిల్ రాజు ప్యానల్ పరిష్కరిస్తుందా? లేదా? చూడాలి.