సిక్స్ ప్యాక్‌లో సాయి ధరమ్ తేజ్!
‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..

‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..
తెలుగు సినిమాల్లో సిక్స్ ప్యాక్ అనేది ఓ ట్రెండ్‌లా మారింది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చేరాడు. సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.
ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్‌లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నాడు. సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్‌లో సిక్స్ ప్యాక్‌లో తేజ్ కనిపిస్తాడట.
ఫిట్‌నెస్ ట్రైనర్ సాయంతో వర్కౌట్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఈ లుక్‌కు మారాడు. డిసెంబర్ 15న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. క్రిస్మస్ కానుకగా ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.