షూటింగ్‌లో చిన్నారులతో సాయి ధరమ్ తేజ్

ప్రతిరోజూ పండగే షూటింగ్‌లో తనను కలవడానికి వచ్చిన చిన్నారులతో సాయి ధరమ్ తేజ్ షేక్‌హ్యాండ్ ఇచ్చి, ఫోటోలు దిగాడు..

  • Published By: sekhar ,Published On : September 22, 2019 / 06:30 AM IST
షూటింగ్‌లో చిన్నారులతో సాయి ధరమ్ తేజ్

Updated On : September 22, 2019 / 6:30 AM IST

ప్రతిరోజూ పండగే షూటింగ్‌లో తనను కలవడానికి వచ్చిన చిన్నారులతో సాయి ధరమ్ తేజ్ షేక్‌హ్యాండ్ ఇచ్చి, ఫోటోలు దిగాడు..

వరస ఫ్లాప్‌లతో సతమతమైన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ మూవీతో ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవడమే కాక తేజుకి నటుడాగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజూ పండగే’ సినిమా చేస్తున్నాడు.

గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇంతకుముందు ‘భలేభలే మగాడివోయ్’ ఈ బ్యానర్ల కలయికలోనే రూపొందగా, మళ్లీ మారుతి చేస్నున్న రెండవ చిత్రం ఇది. సుప్రీమ్ తర్వాత రాశీ ఖన్నా, సాయి ధరమ్ తేజ్‌తో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి దగ్గర్లోని కోరుకొండలో జరుగుతుంది.

Read Also : అక్టోబర్ 22న కొమురం భీమ్ ఫస్ట్‌లుక్..

ఈ సందర్భంగా తనను కలవడానికి లొకేషన్‌కి వచ్చిన చిన్నారులతో సాయి ధరమ్ తేజ్ షేక్‌హ్యాండ్ ఇచ్చి, ఫోటోలు దిగాడు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ‘ప్రతి రోజూ పండగే’ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. థమన్ సంగీతమందిస్తున్నాడు.