Sai Dharam Tej: తేజ్‌కు క్షుద్రపూజల ఎఫెక్ట్..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల యాక్సిడెంట్‌కు గురై, సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గాయాల నుండి కోలుకున్న తేజు....

Sai Dharam Tej: తేజ్‌కు క్షుద్రపూజల ఎఫెక్ట్..?

Sai Dharam Tej Next Movie Around Blackmagic

Updated On : May 30, 2022 / 9:24 PM IST

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల యాక్సిడెంట్‌కు గురై, సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గాయాల నుండి కోలుకున్న తేజు రీసెంట్‌గా మళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని కార్తిక్ వర్మ దండు డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

Sai Dharam Tej : విశ్వక్‌సేన్‌కి మెగా హీరో సపోర్ట్

కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సుకుమార్ కథను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజు ముంబై నుండి వచ్చిన ఓ యంగ్ ఇంజినీర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనపై ఇక్కడ క్షుద్రపూజలు జరుగుతాయట. దీంతో అసలు తనపై క్షుద్రపూజలు ఎవరు జరిపించారు? అనే కోణంలో ఈ సినిమా కథ ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Sai Dharam Tej: బ్యాక్ టు సెట్స్‌లో ఎమోషనల్ అయిన తేజు

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.