Virupaksha : ఓటీటీకి వచ్చేస్తున్న విరూపాక్ష.. ఎప్పుడో తెలుసా?

సాయి ధరమ్ తేజ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'విరూపాక్ష'.. ఓటీటీకి వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో..

Sai Dharam Tej Virupaksha ott release in netflix and date

Sai Dharam Tej Virupaksha : సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తరువాత ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘విరూపాక్ష’. మిస్టిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే ని అందించాడు. ముందుగు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో.. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు.

Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!

ఇక థియేటర్ లో అందర్నీ భయపెట్టిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం చూసింది. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సాయి ధరమ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందో అని అందరు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో మే 21 నుంచి ఈ మూవీ ప్రసారం కానుంది. థియేటర్ లో బయపడి కొన్ని సీన్స్ సరిగా చూసి ఉండరు. ఆ సీన్స్ ఇప్పుడు ఇంటిలో ధైర్యంగా చూసేయండి.

Aadi Keshava : ఆదికేశవగా వైష్ణవ తేజ్ రుద్ర తాండవం..

కాగా సాయి ధరమ్ నటిస్తున్న తాజా చిత్రం వినోదయ సిత్తం రీమేక్. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసేశారు మేకర్స్. PKSDT అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి ‘BRO’ అనే ఇంగ్లీష్ టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కేతిక శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.