Aadavallu Meeku Johaarlu: తానో లేడీ పవన్ కళ్యాణ్.. సాయిపల్లవిపై సుకుమార్ కామెంట్స్!

మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మిగతా హీరోయిన్స్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉండే పాత్రల్ని..

Aadavallu Meeku Johaarlu: తానో లేడీ పవన్ కళ్యాణ్.. సాయిపల్లవిపై సుకుమార్ కామెంట్స్!

Aadavallu Meeku Johaarlu

Updated On : February 28, 2022 / 1:33 PM IST

Aadavallu Meeku Johaarlu: మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మిగతా హీరోయిన్స్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉండే పాత్రల్ని తీసుకుంటూ తన నటనతో, తన డ్యాన్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తూ అభిమానుల్ని సంపాదించుకుంటుంది. ఇప్పుడు తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే.

Aadavallu Meeku Johaarlu: ఆడవారిపై ధీమాతో శర్వా.. కలిసొచ్చిన జానర్ హిట్ ఇస్తుందా?

సాయిపల్లవి ఫ్యాన్స్ లో ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా ఉంటారు. సినిమాలో తన పాత్రలే కాదు రియల్ లైఫ్ లో సాయిపల్లవి బిహేవియర్ కు సెలబ్రిటీలు అభిమానులుగా మారిపోతున్నారు. తాజాగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా సాయిపల్లవి గురించి అదే చెప్పారు. ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన దర్శకుడు సుకుమార్ సాయిపల్లవి గురించి.. ఆమె ఆటిట్యూడ్, బిహేవియర్ గురించి చాలా చెప్పారు.

Sai Pallavi: అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకింకా 29 ఏళ్లే!

సాయి పల్లవి క్రేజ్‌ చూస్తుంటే ఆమె ఒక లేడీ పవన్‌ కల్యాణ్‌ లా కనిపిస్తుందని.. సుకుమార్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సాయి పల్లవి గురించి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా.. కానీ చెప్పే అవకాశం రాలేదని.. ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా.. సాయి పల్లవి గొప్ప నటే కాదు, గొప్ప వ్యక్తి కూడా. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. సినిమా రంగంలో సాయి పల్లవిలా ఉండటం చాలా కష్టం అంటూ సాయిపల్లవిని ఆకాశానికి పొగిడేశారు.