Sai Pallavi : అబ్బాయిలు ఇలా డ్రెస్ చేస్తే సాయి పల్లవికి ఇష్టమంట.. సాయి పల్లవిని కలిసే ఛాన్స్ వస్తే ఇలా వెళ్ళండి..

సాయి పల్లవికి అబ్బాయిలు ఎలాంటి డ్రెస్ వేస్తే నచ్చుతారు అనే ఓ ప్రశ్న ఎదురవ్వగా..

Sai Pallavi Interesting Comments on Men Dressing

Sai Pallavi : సాయి పల్లవి.. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగుతో పాటు సౌత్ అంతా ఫుల్ స్టార్ డమ్ తెచ్చుకుంది. తన సహజమైన నటన, డ్యాన్స్ తో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. బయట, సినిమాల్లో చాలా సింపుల్ గా ఉంటూ, ఎలాంటి మేకప్ లేకుండా, మంచి బట్టలు వేసుకుంటూ.. అబ్బాయిలను మరింత ఫిదా చేసేసింది. లేడీ పవర్ స్టార్ అని పిలుస్తున్నారంటే సాయి పల్లవి క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న సాయి పల్లవి ఇప్పుడు తండేల్ సినిమాతో రాబోతుంది.

గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో చైతన్య, సాయి పల్లవి ట్విట్టర్లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే సాయి పల్లవికి వచ్చిన ప్రశ్నలు చైతూ, చైతూకి వచ్చిన ప్రశ్నలు సాయి పల్లవి అడిగి వాటికి సమాధానాలు ఇచ్చి వీడియోలు తీసి పోస్ట్ చేశారు.

Also Read : Vishwak Sen : మా నాన్న చిరంజీవి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసాడు.. బాస్ ఈజ్ బాస్.. విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సాయి పల్లవికి అబ్బాయిలు ఎలాంటి డ్రెస్ వేస్తే నచ్చుతారు అనే ఓ ప్రశ్న ఎదురవ్వగా సాయి పల్లవి.. ఐరన్ క్లాత్స్ వేసుకుంటే బాగుంటుంది. ఫార్మల్ లేదా క్యాజువల్ ఏదైనా ఐరన్ చేసినవి అయితే బాగుంటుంది. మా ఇంట్లో కూడా అందర్నీ ఐరన్ క్లాత్స్ వేసుకొమ్మని చెప్తాను. డ్రెస్ క్రష్ చేసి ఉంటే నాకు నచ్చదు అని తెలిపింది. దీనికి చైతూ అబ్బాయిలు విన్నారుగా ఇకనుంచి మీరు సాయి పల్లవిని కలవడానికి వస్తే నీట్ గా డ్రై క్లీనింగ్, ఐరన్ చేసిన డ్రెస్ వేసుకురండి అని సరదాగా అన్నారు.

Also Read : Naga Chaitanya : నాగచైతన్య రిటైర్మెంట్ ప్లాన్ ఏంటో తెలుసా? ఆ సినిమాలో చూపించినట్టు..

దీంతో సాయి పల్లవికి అబ్బాయిలు ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని, నీట్ గా ఉంటే నచ్చుతారని అర్ధమవుతుంది. ఇక నుంచి ఆమెను కలవడానికి వెళదామనుకున్న ఫ్యాన్స్, ఆమెని ఇంప్రెస్ చేయాలంటే నీట్ గా రెడీ అయి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని వెళ్తారేమో. ఇటీవల అమరన్ సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టిన సాయి పల్లవి ఇప్పుడు తండేల్ తో మరో హిట్ కొట్టడానికి రెడీ అయింది.