Vishwak Sen : మా నాన్న చిరంజీవి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసాడు.. బాస్ ఈజ్ బాస్.. విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు..
లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Vishwak Sen says Interesting Facts about his Father Karate Raju and Chiranjeevi
Vishwak Sen : విశ్వక్ సేన్ త్వరలో లైలా సినిమాతో రాబోతున్నాడు. విశ్వక్ లేడీ గెటప్ లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో మీడియాతో మాట్లాడి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
Also Read : IND vs ENG : ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పుష్పరాజ్ ఫీవర్.. తగ్గేదేలే..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి.. మీ ఈవెంట్స్ కు ఎక్కువగా నందమూరి హీరోలు గెస్టులుగా వస్తారు, మీరు నందమూరి కాంపౌండ్ అని అంటారు. మరి ఈ సినిమాకు చిరంజీవిని గెస్ట్ గా పిలిచారంట అని అడగ్గా విశ్వక్ సమాధానమిస్తూ.. కాంపౌండ్స్ అనేవి మీరు రాసుకుంటారు. మాకు ఉన్నది ఇంటి కాంపౌండ్ ఒక్కటే. ఇక్కడ ఇండస్ట్రీ అంతా ఒక్కటే. అయినా బాస్ ఈజ్ బాస్. ప్రతిసారి మా కోసం ఉండేవాళ్ళను ఇబ్బందిపెట్టలేము కదా. ఆయన్ని పిలవడానికి నిర్మాతల రిలేషన్స్ ఉండొచ్చు. మా రిలేషన్స్ ఉండొచ్చు. మా నాన్నకు – చిరంజీవి గారికి రాజకీయాల టైం నుంచి పరిచయం ఉంది. ఆ సమయంలో మలక్ పెట్ నుంచి మా నాన్న ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేశారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో హేట్ ఎక్కువ ఉంది. అనవసరంగా ఒకర్నొకరు అనుకుంటున్నారు. ఇలాంటివి ఇంకా పెంచకండి. మేము అందరం ఒక మంచి ఇంటెన్షన్స్ తో ఇలా ప్రమోషన్స్ చేస్తున్నాము. మాకు అందరూ ఒక్కటే అని అన్నారు.
Also Read : Naga Chaitanya : నాగచైతన్య రిటైర్మెంట్ ప్లాన్ ఏంటో తెలుసా? ఆ సినిమాలో చూపించినట్టు..
దీంతో లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. లైలా సినిమాని షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా కూడా వీళ్ళే నిర్మిస్తుండటంతో ఆ రిలేషన్ తోనే చిరంజీవి వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక విశ్వక్ సేన్ వాళ్ళ నాన్న కరాటే రాజు 2009లో మలక్ పేట్ నుంచి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. విశ్వక్ తండ్రికి కూడా సినీ పరిశ్రమలో మంచి పరిచయాలే ఉన్నాయి.