IND vs ENG : ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పుష్పరాజ్ ఫీవర్.. తగ్గేదేలే..
తొలి వన్డే మ్యాచ్‌లో పుష్పా రాజ్ ఫీవర్ కనిపించింది.

IND vs ENG 1st ODI PUSHPA FEVER IN NAGPUR
నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు. మన దేశంలో మ్యాచ్ జరుగుతుండడంతో ఎక్కువ మంది భారత్‌కు సపోర్ట్‌గా ఇంకొందరు ఇంగ్లాండ్ సపోర్టుగా వచ్చారు. అయితే.. ఓ ఫ్యాన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు అతడి స్పెషల్ ఏందీ అని అంటారా.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ పెద్ద సాలీడ్ హిట్‌ను సొంతం చేసుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ జాతర ఎపిసోడ్‌లో బన్నీ గంగమ్మ తల్లి గెటప్‌లో కనిపిస్తాడు. సరిగ్గా అలాంటి గెటప్‌తో ఓ ఫ్యాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. దీంతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరాల కళ్లు అన్నీ ఒక్క సారి అతడిపై ఫోకస్ చేశాయి.
PUSHPA FEVER IN NAGPUR DURING FIRST ODI ⚡ pic.twitter.com/pDY88HIfQw
— Johns. (@CricCrazyJohns) February 6, 2025
మ్యాచ్ చూస్తున్న అతడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. భారత్,ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ చూసేందుకు పుష్ప రాజ్ వచ్చాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (52; 67 బంతుల్లో 4 ఫోర్లు), జాకబ్ బెథెల్ (51; 64 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకాలు బాదారు. ఫిలిప్ సాల్ట్ (43; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ (32; 29 బంతుల్లో 6 ఫోర్లు) లు రాణించారు. హ్యారీ బ్రూక్ (0), జో రూట్ (19), లిమాయ్ లివింగ్ స్టోన్ (5) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్, మహ్మద్ షమీ కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు.