IND vs ENG : చ‌రిత్ర సృష్టించిన హ‌ర్షిత్ రాణా.. ఒకే ఒక్క భార‌త బౌల‌ర్‌.. జ‌హీర్‌, ఇషాంత్, భువీ ఎవ్వ‌రికి సాధ్యం కానీ రికార్డు..

టీమ్ఇండియా స్టార్ బౌల‌ర్లు జ‌హీర్ ఖాన్, ష‌మీ, ఇషాంత్, భువీ ఇలా ఎవ్వ‌రికి సాధ్యం కానీ ఓ రికార్డును హ‌ర్షిత్ రాణా సాధించాడు.

IND vs ENG : చ‌రిత్ర సృష్టించిన హ‌ర్షిత్ రాణా.. ఒకే ఒక్క భార‌త బౌల‌ర్‌.. జ‌హీర్‌, ఇషాంత్, భువీ ఎవ్వ‌రికి సాధ్యం కానీ రికార్డు..

Harshit Rana is the first Indiam bowler to take 3 plus wicket on his debut innings across all formats

Updated On : February 6, 2025 / 4:46 PM IST

టీమ్ఇండియా పేస‌ర్ హ‌ర్షిత్ రాణా అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20, వ‌న్డే, టెస్టుల్లో అరంగ్రేటం చేసిన మ్యాచ్‌ల్లో మూడు లేదా అంత‌కంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. నాగ్‌పూర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయ‌డం ద్వారా హ‌ర్షిత్ రాణా ఈ ఘ‌న‌త సాధించాడు.

ఇదే ఇంగ్లాండ్ పై కొద్ది రోజుల ముందు జ‌రిగిన టీ20 సిరీస్‌లో నాలుగో టీ20 మ్యాచ్ ద్వారా పొట్టి ఫార్మాట్‌లో అనూహ్యంగా అరంగ్రేటం చేశాడు. శివ‌మ్ దూబె కంక‌ష‌న్‌కు గురి కాగా.. కంక‌ష‌న్ స‌బ్‌గా బ‌రిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు నాలుగు ఓవ‌ర్ల‌లో 33 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

Champions Trophy 2025 : క‌మిన్స్, హేజిల్‌వుడ్, మార్ష్‌, గ్రీన్‌, స్టోయినిస్.. ఒక్క‌రు కూడా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆడ‌డం లేదు.. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టులో ఉన్న‌ది ఎవ‌రంటే ?

అంత‌క‌ముందు బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదిక‌గా జ‌రిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణా అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో రాణా 48 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రాణా అరంగ్రేట మ్యాచ్‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న ఇలా..

టెస్టు – ఆస్ట్రేలియా పై 3/48
టీ20 – ఇంగ్లాండ్ పై 3/33
వ‌న్డే- ఇంగ్లాండ్ పై 3/53 (నేటి మ్యాచ్‌లో )

చెత్త రికార్డు సైతం..

ఈ మ్యాచ్ లో రాణా ఓ చెత్త రికార్డును మూట గ‌ట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవ‌ర్‌ను వేశాడు. ఇంగ్లాండ్ ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ దంచికొట్టాడు. 6, 4, 6, 4, 0, 6 బాది ఈ ఓవ‌ర్‌లో 26 ప‌రుగులు సాధించాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో అరంగ్రేట మ్యాచ్‌లో ఓ ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు ఇచ్చిన భార‌త బౌల‌ర్‌గా చెత్త రికార్డును మూట గ‌ట్టుకున్నాడు.

IND vs ENG : అరంగ్రేట మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ బ్యాట‌ర్.. వీడియో వైర‌ల్‌..

కోహ్లీ దూరం..
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ప‌రుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీ ఆడ‌డం లేదు. అత‌డు మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తెలిపాడు. మ‌రో స్టార్ ఆట‌గాడు రిష‌బ్ పంత్ సైతం తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. వికెట్ కీప‌ర్‌గా రాహుల్‌ను తీసుకున్నారు. ష‌మీతో పాటు మ‌రోపేస‌ర్ గా హ‌ర్షిత్‌ను తీసుకోవ‌డంతో అర్ష్‌దీప్ సింగ్ కు కూడా తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు.

భారత తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మ‌న్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.

ఇంగ్లాండ్ తుది జట్టు..
బెన్ డెకట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెత్ వెల్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్ , సకిబ్ మహమూద్.