IND vs ENG : అరంగ్రేట మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ బ్యాట‌ర్.. వీడియో వైర‌ల్‌..

ఇంగ్లాండ్‌తో తొలి వ‌న్డేలో య‌శ‌స్వి జైస్వాల్ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

IND vs ENG : అరంగ్రేట మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ బ్యాట‌ర్..  వీడియో వైర‌ల్‌..

Yashasvi Jaiswal takes stunning catch in first ODI against England

Updated On : February 6, 2025 / 3:33 PM IST

మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు తొలి వ‌న్డే మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా య‌శ‌స్వి జైస్వాల్‌, హ‌ర్షిత్ రాణాలు వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు. కాగా.. య‌శ‌స్వి జైస్వాల్ ఓ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప‌దో ఓవ‌ర్‌ను హ‌ర్షిత్ రాణా వేశాడు. మూడో బంతిని బెన్ డ‌కెట్ పుల్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. టైమింగ్ మిస్ కావ‌డంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని మిడ్ వికెట్ దిశ‌గా గాల్లోకి లేచింది. వెంట‌నే జైస్వాల్ ప‌రిగెత్తాడు. త‌న కంటి చూపుని బాల్ పై మాత్ర‌మే ఉంచాడు. వెన‌క్కి ప‌రిగెత్తుతూ.. డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని ఒడిసి ప‌ట్టుకున్నాడు. ఎంతో క్లిష్ట‌మైన క్యాచ్‌ను జైస్వాల్ ప‌ట్టుకున్న తీరుకు అంతా ఫిదా అయ్యారు. అయితే.. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ బెన్‌డ‌కెట్ మాత్రం బిత్త‌ర‌పోయాడు.

ఇదేందిది..! ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తే.. రిటైర్మెంట్ ఇచ్చిన ఆల్ రౌండర్

వెంట‌నే టీమ్ఇండియా స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు జైస్వాల్ వ‌ద్ద‌కు వెళ్లి అత‌డిని అభినందించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారగా.. జైస్వాల్ నువ్వు సూప‌ర్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

కోహ్లీ దూరం..
కాగా.. ఈ మ్యాచ్‌కు టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. గ‌త రాత్రి నుంచి అత‌డు మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వెల్ల‌డించాడు. వికెట్ కీప‌ర్‌గా రాహుల్‌ను తీసుకోవ‌డంతో రిష‌బ్ పంత్ బెంచీకే ప‌రిమితం అయ్యాడు. ష‌మీతో పాటు మ‌రోపేస‌ర్ గా హ‌ర్షిత్‌ను తీసుకోవ‌డంతో అర్ష్‌దీప్ సింగ్ కు కూడా తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

Harshit Rana : ఏందిదీ రాణా.. మొన్న టీ20 అరంగ్రేటంలో మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌.. నేడు వ‌న్డే అరంగ్రేటంలో చెత్త రికార్డు..

భారత తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మ‌న్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.

ఇంగ్లాండ్ తుది జట్టు..
బెన్ డెకట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెత్ వెల్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్ , సకిబ్ మహమూద్.