చిరంజీవి సినిమాలో చెల్లెలుగా స్టార్ హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను అంగీకరిస్తున్నారు. టాప్ డైరెక్టర్స్, క్రేజీ హిట్ డైరెక్టర్స్, చిన్న డైరెక్టర్స్ అనే తేడా లేకుండా సినిమాలను ఒప్పుకుంటున్నారు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ ‘వేదాళం’ రీమేక్‌లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తమిళ వేదాళం సినిమాను అజిత్ హీరోగా తెరకెక్కించగా.. అక్కడ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే కథతో సినిమాను తీస్తుండగా.. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాత్ర కోసం తెలుగులో సాయిపల్లవి పేరును పరిశీలిస్తుండగా సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తమిళ మాతృకలో అజిత్ చెల్లిగా లక్ష్మీమీనన్ నటించింది. తెలుగులో ఈ పాత్రకు ఆమెనే తీసుకుంటారని భావించారు. అయితే ఇప్పుడు సాయిపల్లవి పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
https://10tv.in/mirchi-gang-gang-star-and-notorious-up-gangster-ashu-jaat-sells-fruits-in-mumbai-arrested/
సినిమాలో ముఖ్యమైన పాత్ర కావడంతో పాటు చిరంజీవి హీరోగా చేస్తుండడంతో సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. స్టోరీ ముందుకు సాగడంలో చెల్లెలు పాత్ర ముఖ్యంగా ఉంటుంది. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో నాగచైతన్య సరసన ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మళ్లీ ఇటీవల కరోనా తర్వాత చిత్రయూనిట్ ప్రారంభించింది.