Sai Ram Shankar Oka Pathakam Prakaram Movie Streaming in OTT
Oka Pathakam Prakaram : డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా పలు సినిమాలతో మెప్పించిన సంగతి తెలిసిందే. మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇటీవల అడపాదడపా సినిమాలతో వస్తున్నాడు. సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కిన ‘ఒక పథకం ప్రకారం’ ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజయింది. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని.. పలువురు కీలక పాత్రలు పోషించారు.
ఒక పథకం ప్రకారం సినిమా నిన్న జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ సబ్జెక్టు కావడంతో మంచి వ్యూస్ రాబడుతుంది. సినిమా థియేటరికల్ రిలీజ్ సమయంలో ఇంటర్వెల్ లో విలన్ ఎవరో కనిపెట్టి చెప్తే ప్రేక్షకులకు 10 వేలు ఇస్తామని ప్రకటించి అలా 50 థియేటర్ల నుంచి 50 మంది విజేతలను ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చారు.
ఓటీటీ రిలీజ్ సందర్భంగా నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ మాట్లాడుతూ… మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా మంచి రీచ్ వస్తుంది. ఓటీటీ రిలీజ్ ప్లానింగ్, ప్రొసీజర్స్ విషయంలో మాకు సహాయం చేసిన సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశి కిరణ్ నారాయణ గారికి చాలా థాంక్స్ అని తెలిపారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. సిద్దార్థ్ నీలకంఠ(సాయి రామ్ శంకర్) ఒక మంచి లాయర్. తన భార్య సీత(ఆషిమా నర్వాల్) కనిపించకుండా పోవడంతో భార్యని వెతుకుతూ, బాధపడుతూ డ్రగ్స్ కి అడిక్ట్ అవుతాడు. దాంతో అతన్ని సస్పెండ్ చేస్తారు. ఓ రోజు అనుకోకుండా దివ్య(భానుశ్రీ) మర్డర్ కేసులో సిద్దార్థ్ ని అనుమానించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయినా తర్వాత వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఆ మర్డర్స్ చేసేది ఎవరు? సిద్దార్థ్ నిరపరాధి అని ఎలా తెలుస్తుంది? సిద్దార్థ్ భార్య దొరుకుతుందా తెలియాలంటే ఓటీటీలో సినిమా చూసేయాల్సిందే.