Sai Dharam Tej : కలర్స్ స్వాతితో కలిసి మ్యూజికల్ ఆల్బమ్ తో రాబోతున్న సాయి ధరమ్ తేజ్..

తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్స్ స్వాతి తో కలిసి ఓ మ్యూజికల్ ఆల్బమ్ చేస్తున్నాడు. రిపబ్లిక్ డే రోజు దీనిపై అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు..........

Sai Dharam Tej : కలర్స్ స్వాతితో కలిసి మ్యూజికల్ ఆల్బమ్ తో రాబోతున్న సాయి ధరమ్ తేజ్..

SaiDharam Tej coming with a short musical album along swathi reddy

Updated On : January 27, 2023 / 7:41 AM IST

Sai Dharam Tej :  హీరోలు, హీరోయిన్స్ అప్పుడప్పుడు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ఉంటారు. వాటిలో ఏదన్నా స్పెషలిటీ ఉంటే లేక ఏదైనా మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిలిమ్స్ లాంటివి చేస్తారు. తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్స్ స్వాతి తో కలిసి ఓ మ్యూజికల్ ఆల్బమ్ చేస్తున్నాడు. రిపబ్లిక్ డే రోజు దీనిపై అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మాణంలో నవీన్ విజయ కృష్ణా దర్శకత్వంలో ‘సత్య’ అనే టైటిల్ తో ఈ మ్యూజిక్ ఆల్బమ్ ని తెరకెక్కిస్తున్నారు. శృతి రంజని దీనికి సంగీతం అందిస్తుంది. పోస్టర్ పై సాయిధరమ్ తేజ్ వెళ్లిపోతుంటే స్వాతి గట్టిగా హగ్ చేసుకున్న ఫొటోని పెట్టారు. అలాగే An Ode The Unsung Warriors Of India అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఇది దేశభక్తిని చూపించే మ్యూజిక్ ఆల్బమ్ అని తెలుస్తుంది. ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ.. మన దేశం కోసం పనిచేసే హీరోలకు సంగీత నివాళి ఇస్తూ సాయి ధరమ్ తేజ్, స్వాతి రెడ్డి త్వరలో మీ ముందుకి రాబోతున్నారు. ఈ ప్రాజెక్టు మీ హృదయాన్ని కదిలిస్తుంది. త్వరలోనే ఓ స్పెషల్ రోజున దీన్ని విడుదల చేస్తాము” అంటూ పోస్ట్ చేశారు.

Balakrishna : ఏఎన్నార్ నాకు బాబాయ్ లాంటి వారు.. ఫ్లోలో వచ్చిన మాటలని వివాదాస్పదం చేశారు..

యాక్సిడెంట్ తో కొన్ని నెలలు ఇంటికే పరిమితమైన సాయిధరమ్ తేజ్ ఇటీవలే తన నెక్స్ట్ సినిమా విరూపాక్ష గ్లింప్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సడెన్ గా ఈ షార్ట్ ఆల్బమ్ ని అనౌన్స్ చేయడంతో అభిమానులతో పాటు అంతా సాయిధరమ్ తేజ్ అని అభినందిస్తున్నారు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఓ మెసేజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే.