Saif Ali Khan : సైఫ్ కంటే ముందు కొడుకుపై దాడి.. నా కొడుకు ఏడుస్తున్నాడు.. పోలీసులకు సంచలన విషయాలు చెప్పిన సైఫ్ అలీ ఖాన్..

సైఫ్ అలీ ఖాన్ ఈ ఘటన గురించి బాంద్రా పోలీసులకు ఏమని చెప్పాడంటే..

Saif Ali Khan Attcak Case Update Bandra Police Records Statement

Saif Ali Khan : ఇటీవల బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగుడు అతనిపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అయిదు రోజులు హాస్పిటల్ లో ఉండి పలు సర్జరీల అనంతరం ఇటీవల జనవరి 21న సైఫ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించారు.

ఇన్ని రోజులు సైఫ్ హాస్పిటల్ లో ఉండి వచ్చారు. వారం రోజులు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు సైఫ్. దీంతో పోలీసులు సైఫ్ అలీ ఖాన్ దగ్గర కూడా ఈ సంఘటన గురించి స్టేట్మెంట్ తీసుకున్నారు.

Also Read : Sai Kumar – Balakrishna : బాలయ్యని గుండెల మీద తన్నాలి.. నాకు టెన్షన్.. సీమ సింహం సినిమా అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

సైఫ్ అలీ ఖాన్ ఈ ఘటన గురించి బాంద్రా పోలీసులకు ఏమని చెప్పాడంటే.. ఈ దాడి జరిగినప్పుడు సైఫ్, అతని భార్య ఒక బెడ్ రూమ్ లో, తన కొడుకు జెహాంగీర్ అతన్ని పెంచే నానీ ఒక రూమ్ లో ఉన్నారని తెలిపాడు. 11వ ఫ్లోర్ లో తమ అపార్ట్మెంట్ లో జెహాంగీర్, నానీ అరుపులతో మాకు మెలకువ వచ్చి ఆ రూమ్ కి వెళ్ళాను. అప్పటికే అతను వాళ్లపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నానీ భయంతో అరుస్తుంది. జెహాంగీర్ ఏడుస్తున్నాడు. దాంతో నేను అతన్ని ఎదుర్కొన్నాను. అతను నాపై కత్తితో దాడి చేసాడు. ఈ క్రమంలో నానీని, బాబుని ఒక రూమ్ లో పెట్టి డోర్ లాక్ చేశాను. అతను నాపై దాడై చేసి పారిపోయాడు అని తెలిపాడు. వీటితో మరిన్ని విషయాలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది.

Also Read : Virender Sehwag Divorce: భార్యతో విడిపోయేందుకు సిద్ధమైన భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్..? కారణాలు ఏమిటంటే..

దీంతో దొంగతనానికి వచ్చిన నిందితుడు సైఫ్ చిన్న కొడుకుపై మొదట దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. వాళ్ల అరుపులు విని సైఫ్ రావడంతో సైఫ్ పై దాడికి దిగాడు. దాడి అనంతరం సైఫ్ ని తన మరో కొడుకు ఇబ్రహీం ఆటోలో దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం సైఫ్ ఇంటి చుట్టూ పోలీస్ బందోబస్తుతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే భద్రత కోసం పలు సీసీ కెమెరాలు తన ఇంటి చుట్టూ బిగించారు.