Virender Sehwag Divorce: భార్యతో విడిపోయేందుకు సిద్ధమైన భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్..? కారణాలు ఏమిటంటే..
వీరేంద్ర సెహ్వాగ్ కు 2004లో ఆర్తి అహ్లావత్ తో వివాహం జరిగింది. ఆర్తి సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Aarti Ahlawat and Virender Sehwag
Virender Sehwag Divorce: భారత క్రికెట్ చరిత్రలో డాషింగ్ ఓపెనింగ్ బ్యాటర్ ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. అతను క్రీజులో ఉన్నాడంటే బౌండరీల వరద పారాల్సిందే. ప్రత్యర్థి బౌలర్లుసైతం సెహ్వాగ్ కు బౌలింగ్ చేయాలంటే కాస్త భయపడేవారు. ప్రపంచ స్థాయి బౌలర్లనుసైతం సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్ తో వణికించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత క్రికెట్ వ్యాఖ్యాతగానూ, పలు వ్యాపారాల్లోనూ సెహ్వాగ్ నిమగ్నమయ్యాడు. అయితే, సెహ్వాగ్ గురించి షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. గత రెండురోజుల నుంచి వీరేంద్ర సెహ్వాగ్ విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీరేంద్ర సెహ్వాగ్ కు 2004లో ఆర్తి అహ్లావత్ తో వివాహం జరిగింది. ఆర్తి సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. ఆమె ఢిల్లీ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసింది. ఆర్తి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. 2004లో మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాసంలో వారి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2007లో ఆర్యవీర్ జన్మించగా.. 2010లో వేదాంత్ జన్మించారు. వీరిద్దరూ కెరీర్ పరంగా తండ్రిబాటలోనే క్రికెట్ ను ఎంచుకున్నారు.
Also Read: Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా.. బట్లర్ షాక్.. వీడియో వైరల్
రెండు దశాబ్దాల పాటు వైవాహిక బంధంలో ఉన్న సెహ్వాగ్, ఆర్తిలు విడుపోతున్నారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా వీరిమధ్య మనస్పర్థలు తలెత్తడంతో వారిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. గతేడాది దీపావళి పర్వదినం రోజున సెహ్వాగ్, తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను మాత్రమే పంచుకున్నాడు. సెహ్వాగ్ ఇటీవల పాలక్కాడ్ లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించిన సమయంలోనూ ఆ చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. అయితే, ఆర్తి గురించి అందులో ప్రస్తావించలేదు. దీనికితోడు గత కొంతకాలంగా సెహ్వాగ్ చేసే ఇన్ స్టాగ్రామ్ పోస్టుల్లో ఆయన సతీమణి కనిపించక పోవడంతో వీరిద్దరూ విడిపోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఆర్తిని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అన్ ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే, విడాకుల గురించి వస్తున్న వార్తలపై సెహ్వాగ్, అతని భార్య ఆర్తి ఇప్పటి వరకు స్పందించలేదు.
సెహ్వాగ్ 1999లో భారత క్రికెట్ జట్టులోకి అరంగ్రేటం చేశాడు. 2015అక్టోబర్ 20న అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్ లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లను ఆడిన సెహ్వాగ్.. 17వేల పైగా పరుగులు చేశాడు. సెహ్వాగ్ రిటైర్మెంట్ తరువాత వ్యాఖ్యాతగా, ఇతర వ్యాపారాల్లో కొనసాగుతున్నారు. అయితే, సెహ్వాగ్ తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలపై వారి కుటుంబ సభ్యులుకూడా స్పందించలేదు. ప్రస్తుతం సెహ్వాగ్ విడాకుల అంశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సెహ్వాగ్ స్పందించి విడాకులపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెడతాడా.. లేదా అనేది వేచిచూడాల్సిందే.
View this post on Instagram