Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా.. బట్లర్ షాక్.. వీడియో వైరల్

Nitish Kumar Reddy: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో నితీశ్ కుమార్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్ తో బట్లర్ ను పెవిలియన్ కు పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా.. బట్లర్ షాక్.. వీడియో వైరల్

Nitish Kumar Reddy

Updated On : January 23, 2025 / 6:51 AM IST

Nitish Kumar Reddy: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 132 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 12.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా బౌండరీల మోత మోగించాడు. దీంతో కేవలం 34 బంతుల్లో 79 పరుగులు చేయడంతో టీమిండియా సునాయస విజయాన్ని అందుకుంది.

Also Read: Champions Trophy 2025 : బీసీసీఐకి షాక్‌.. పాకిస్థాన్ మాట వినాల్సిందేన‌న్న ఐసీసీ.. ఇదేం ట్విస్ట్!

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేదు. బట్లర్ మాత్రం దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తెలుగు కుర్రాడు.. టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్ తో బట్లర్ ను పెవిలియన్ కు పంపాడు.

Also Read: IND vs ENG 1st T20 : ప్ర‌పంచ రికార్డు పై తెలుగోడి క‌న్ను.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేనా?

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేయగా.. తొలి బంతిని బట్లర్ సిక్సర్ గా మలిచే ప్రయత్నం చేశాడు. బాల్ గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్ కు కొద్దిదూరంలో పడుతున్న క్రమంలో అక్కడే ఫీల్డింగ్ లోఉన్న నితీశ్ కుమార్ రెడ్డి వేగంగా దూసుకొచ్చి ముందుకు డ్రైవ్ చేసి కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్ బట్లర్ సైతం షాక్ కు గురయ్యాడు. ఆ తరువాత బట్లర్ (44 బంతుల్లో 68 పరుగులు) నిరాశతో పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో నితీశ్ కుమార్ రెడ్డి రెండు క్యాచ్ లను అందుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి డ్రైవింగ్ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో తెలుగు కుర్రాడిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోనూ అద్భుతంగా రాణించాడు. బాక్సింగ్ డే టెస్టులో అద్భుత సెంచరీతో అందరిచేత ప్రశంసలు పొందాడు. ఆ మ్యాచ్ లో నితీశ్ రెడ్డి హాఫ్ సెంచరీ తరువాత ‘పుష్ప’ స్టైల్ లో తగ్గేదేలే అంటూ బ్యాట్ తో గడ్డాన్ని సవరించుకోవడం.. సెంచరీ అనంతరం ‘బాహుబలి’ స్టైల్లో బ్యాట్ ను కత్తిలా నేలమీద పెట్టి మోకాలు మీద కూర్చోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నితీశ్ రెడ్డి అద్భుత ఆటతీరును ప్రశంసిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ. 25లక్షల ప్రకటించింది. ఈ చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా నితీశ్ రెడ్డి అందుకున్నాడు. ఈ సందర్భంగా నితీశ్ రెడ్డిని చంద్రబాబు అభినందించారు.