IND vs ENG 1st T20 : ప్రపంచ రికార్డు పై తెలుగోడి కన్ను.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేనా?
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రపంచ రికార్డు పై కన్నేశాడు.

PIC credit@ BCCI twitter
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రపంచ రికార్డు పై కన్నేశాడు. టీ20 మ్యాచుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో నేడు జరగనున్న తొలి టీ20 మ్యాచులో అతడు సెంచరీ చేస్తే ఈ ఘనత అందుకుంటాడు. అదే జరిగితే క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలవనున్నాడు.
తిలక్ వర్మ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. 22 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గత నవంబర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి రెండు టీ20ల్లో శతకాలు బాదాడు. మూడో టీ20లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలవగా, నాలుగో టీ20లో కేవలం 47 బంతుల్లో 120 పరుగులో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తరువాత మరో టీ20 మ్యాచ్ ఆడలేదు. ఇంగ్లాండ్‌తో నేడు ఆడనున్న మ్యాచులో శతకంతో చెలరేగితే క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటాడు.
IND vs ENG : బంపర్ ఆఫర్.. ఈ శనివారం మెట్రోలో ఉచిత ప్రయాణం..
వరుసగా రెండు శతకాలు సాధించిన ఆటగాళ్లు వీళ్లే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు మ్యాచుల్లోనూ సెంచరీలు చేసిన ఆటగాళ్లు ఉన్నారు. సంజూ శాంసన్, రూసో, ఫిల్ సాల్ట్ వంటి క్రికెటర్లు వరుసగా రెండు మ్యాచుల్లోనూ శతకాలు బాదిన మూడో సెంచరీని అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ అవకాశం తిలక్ వర్మకు వచ్చింది. మరి తిలక్ అయిన ఈ రికార్డును అందుకుంటాడో లేదో చూడాల్సిందే.
ఇప్పటి వరకు టీమ్ఇండియా తరపున 20 టీ20లు ఆడిన తిలక్ వర్మ 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 2 అర్థశతకాలు ఉన్నాయి.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు స్క్వాడ్‌లు..
భారత్..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్.
IND vs ENG : ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్..!
ఇంగ్లాండ్..
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.