IND vs ENG : బంపర్ ఆఫర్.. ఈ శ‌నివారం మెట్రోలో ఉచిత‌ ప్ర‌యాణం..

చెన్నై వేదిక‌గా శ‌నివారం రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IND vs ENG : బంపర్ ఆఫర్.. ఈ శ‌నివారం మెట్రోలో ఉచిత‌ ప్ర‌యాణం..

Good news to Cricket fans TNCA has announced free metro travel

Updated On : January 22, 2025 / 11:24 AM IST

ఇంగ్లాండ్‌తో భార‌త జ‌ట్టు స్వ‌దేశంలో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. తొలి మ్యాచ్ నేడు కోల్‌క‌తా వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈమ్యాచ్ కోసం ఇప్ప‌టికే రెండు జ‌ట్లు కోల్‌క‌తా చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుండ‌గా, జోస్ బ‌ట్ల‌ర్ నాయ‌క‌త్వంలో ఇంగ్లాండ్ ఆడ‌నుంది. రాత్రి 7 గంట‌ల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. బ‌లాబ‌లాల ప‌రంగా రెండు జ‌ట్లు దాదాపుగా స‌మ ఉజ్జీలుగా క‌నిపిస్తున్నాయి. దీంతో తొలి టీ20 మ్యాచ్ హోరా హోరీగా జ‌ర‌డం ఖాయం.

ఇక చెన్నై వేదిక‌గా శ‌నివారం రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ టికెట్ల‌ను త‌మిళనాడు క్రికెట్ అసోసియేష‌న్ (టీఎన్‌సీఏ) అమ్మ‌కానికి ఉంచ‌గా గంట‌ల్లోనే అన్నీ అమ్ముడుపోయాయి. కాగా.. మ్యాచ్ చూసేందుకు వ‌చ్చే క్రికెట్ అభిమానుల‌కు టీఎన్‌సీఏ ఓ శుభ‌వార్త చెప్పింది. ఆ రోజు ఉచిత మెట్రో ప్ర‌యాణం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపింది.

IND vs ENG : భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 నేడే.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

మ్యాచ్ టికెట్లు కొన్న ప్ర‌తి ఒక్క‌రు టికెట్‌ను చూపించి మెట్రోలో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చున‌ని, అభిమానులు అంద‌రూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

Mohammed Siraj: జట్టులో చోటుకోల్పోవడంతో మహ్మద్ సిరాజ్ కీలక నిర్ణయం.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..

వాస్త‌వానికి త‌మిళ‌నాడు క్రికెట్ అసోసియేష‌న్ ఇలా ఉచిత మెట్రో ప్ర‌యాణం క‌ల్పించ‌డం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో చెన్నైలో జ‌రిగిన మ్యాచుల‌కు అన్నింటికి ఉచిత మెట్రో స‌ర్వీస్‌ను క‌ల్పించింది. అయితే.. అంత‌ర్జాతీయ మ్యాచ్‌కు మాత్రం ఇలా ఉచిత స‌ర్వీస్‌ను కల్పించ‌డం ఇదే తొలిసారి. చెపాక్ స్టేడియం చుట్టు ప్ర‌క్క‌ల ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు త‌మిళ‌నాడు క్రికెట్ అసోసియేష‌న్ ఈ నిర్ణయం తీసుకుంది.