Mohammed Siraj: జట్టులో చోటుకోల్పోవడంతో మహ్మద్ సిరాజ్ కీలక నిర్ణయం.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..

టీమిండియాకు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండేళ్లుగా వన్డే ఫార్మాట్ లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.

Mohammed Siraj: జట్టులో చోటుకోల్పోవడంతో మహ్మద్ సిరాజ్ కీలక నిర్ణయం.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..

Mohammed Siraj

Updated On : January 21, 2025 / 2:19 PM IST

Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు కీలక సిరీస్ లకు సన్నద్ధమవుతుంది. వచ్చేనెల ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో మూడు వన్డేల సిరీస్ లో ఆడనున్న టీమిండియా.. వచ్చేనెల 19 నుంచి పాకిస్థాన్ సారథ్యంలో జరిగే ఛాంపియన్స్ ట్రోపీ-2025లో పాల్గోనుంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ సైతం విడుదలకాగా.. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే, క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే పాకిస్థాన్ – భారత్ జట్ల మధ్య హైవోల్టేజీ మ్యాచ్ మాత్రం ఫిబ్రవరి 23న జరగనుంది. ఇదిలాఉంటే.. ఈ రెండు సిరీస్ లకు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. 15మంది సభ్యులు కలిగి జట్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ కు సెలెక్టర్లు చోటు కల్పించారు.

Also Read: Champions Trophy 2025: వైస్ కెప్టెన్సీ ఎంపిక విషయంలో గంభీర్, రోహిత్ మధ్య వాగ్వివాదం..? హార్దిక్ పేరు ప్రస్తావన..

టీమిండియాకు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండేళ్లుగా వన్డే ఫార్మాట్ లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, సెలెక్టర్లు మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు ఇంగ్లండ్ తో జరిగే వన్డేలకు సిరాజ్ ను జట్టులో ఎంపిక చేయలేదు. దీంతో అతను మరో ఐదు నెలలు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఊహించని పరిణామంతో సిరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మళ్లీ జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర ఫొటో షేర్ చేశాడు. దానికి ఓ క్యాప్షన్ సైతం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రోహిత్‌, వైస్ కెప్టెన్‌గా గిల్‌.. సిరాజ్‌కు నో ప్లేస్‌..

ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మహ్మద్ సిరాజ్ ను ఎంపిక చేయకపోవటం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల వివరణ ఇచ్చారు. కొత్త బంతి, పాత బంతితో ప్రభావం చూపే బౌలర్ తమకు కావాలని, అందుకే సిరాజ్ స్థానంలో అర్ష్ దీప్ కు ఛాన్స్ ఇచ్చామని చెప్పుకొచ్చాడు. అయితే, బంతి పాతబడినప్పుడు సిరాజ్ బౌలింగ్ ప్రభావం తగ్గుతుందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ తరువాత టీమిండియా ఆడే సిరీస్ లలో జట్టులో చోటు దక్కించుకోవాలని సిరాజ్ పట్టుదలతో ఉన్నాడు. దీంతో ఇప్పటినుంచే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో జిమ్ లో చెమడోడ్చుతున్న ఫొటోను సిరాజ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేశాడు. దీనికి క్యాప్షన్.. ‘‘రెస్ట్.. రీస్టార్ట్.. రీఫోకస్’ అని రాసి స్ట్రెంత్ ఎమోజీని పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు సిరాజ్ ను అభినందిస్తూ సపోర్టు చేస్తున్నారు.

 

కొన్నేళ్లుగా అద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ వస్తున్న సిరాజ్.. భారత్ జట్టులో అత్యంత విజయవంతమైన వన్డే బౌలర్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. 2022 నుంచి అతను 43 వన్డేల్లో 22.97 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా కూడా ఉన్నాడు.