Champions Trophy 2025: వైస్ కెప్టెన్సీ ఎంపిక విషయంలో గంభీర్, రోహిత్ మధ్య వాగ్వివాదం..? హార్దిక్ పేరు ప్రస్తావన..

ఛాంపియన్స్ ట్రోపీ-2025 జట్టు ఎంపిక విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య వాదనలు జరిగినట్లు ...

Champions Trophy 2025: వైస్ కెప్టెన్సీ ఎంపిక విషయంలో గంభీర్, రోహిత్ మధ్య వాగ్వివాదం..? హార్దిక్ పేరు ప్రస్తావన..

Champions Trophy 2025

Updated On : January 19, 2025 / 1:28 PM IST

Champions Trophy 2025: ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోపీ-2025 టోర్నీకోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతుండగా.. వైస్ కెప్టెన్ బాధ్యతలను శుభమన్ గిల్ కు కట్టబెట్టారు. అయితే, వైస్ కెప్టెన్సీ విషయంలోనూ టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జట్టు ఎంపికకోసం శనివారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, గంభీర్, రోహిత్ శర్మతో పాటు బీసీసీఐ బోర్డు సభ్యులు సమావేశం అయ్యారు. వాస్తవానికి మధ్యాహ్న 12.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటుచేసి అగార్కర్, రోహిత్ శర్మ జట్టు వివరాలను వెల్లడిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ, అనుకున్న సమయానికి కంటే రెండున్నర గంటల ఆలస్యంగా మీడియా సమావేశం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం.. జట్టు ఎంపిక విషయంలో గంభీర్, రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటమేనని తెలుస్తోంది. అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ పేర్కొన్న రెండు విషయాలను గంభీర్ తీవ్రంగా వ్యతిరేఖించినట్లు సమాచారం.

Also Read: ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రోహిత్‌, వైస్ కెప్టెన్‌గా గిల్‌.. సిరాజ్‌కు నో ప్లేస్‌..

జాతీయ మీడియాలో కథనాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోపీ కోసం వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పేరును గంభీర్ ప్రతిపాదించగా.. అగార్కర్, రోహిత్ శర్మలు మాత్రం శుభమన్ గిల్ పేరును ప్రతిపాదించారు. మరోవైపు టీమిండియా వికెట్ కీపర్ విషయంలోనూ గంభీర్, రోహిత్ మధ్య వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. గంభీర్ వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, రోహిత్ శర్మ, అగార్కర్ మాత్రం రిషబ్ పంత్ కు మద్దతు తెలిపారు. సమావేశంలో గంభీర్ లేవనెత్తిన రెండు విషయాలపై సుదీర్ఘంగా చర్చజరిగినట్లు తెలుస్తుంది. మెజార్టీ బోర్డు సభ్యులు రోహిత్, అగార్కర్ నిర్ణయాలకే మద్దతు తెలపడంతో వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్, వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ పేర్లతో తుదిజట్టులో చేర్చారు.

Also Read: Virat Kohli – KL Rahul : రంజీ మ్యాచుల‌కు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు దూరం?

జస్ర్పీత్ బుమ్రా ఎంపిక విషయంలోనూ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ సమయానికి బుమ్రా ఫిట్ నెస్ పై అజిత్ అగార్కర్ అనుమానం వ్యక్తం చేయగా.. మిగిలిన వారుసైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చినట్లు తెలిసింది. అయితే, భారత్ జట్టు బౌలింగ్ విభాగానికి బుమ్రా కీలకం కావడంతో అతన్ని కొనసాగిస్తూనే.. ఇంగ్లాండ్ సిరీస్ కోసం హర్షిత్ రాణాకు తుదిజట్టులో అవకాశం కల్పించారు. అయితే, ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండడు. ఎన్సీఏ వైద్య బృందం నుంచి బుమ్రా ఫిట్ నెస్ పై తుది నివేదిక వచ్చిన తరువాత ఇంగ్లాండ్ జట్టుతో మూడో మ్యాచ్ లో ఆడించాలా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

 

అగార్కర్ విలేకరుల సమావేశంలో బుమ్రా ఫిట్ నెస్ విషయంపై ప్రస్తావిస్తూ.. బుమ్రా ఐదు వారాల పాటు అందుబాటులో ఉండడని తెలిపారు. ఇంగ్లాండ్ జట్టు జరిగే సిరీస్ లో రెండు వన్డేలకు అందుబాటులో ఉండడు. అతని ఫిట్ నెస్ కోసం ఎదురుచూస్తున్నాం. వైద్య బృందం నుంచి ఫిబ్రవరి మొదటి వారంలో బుమ్రా ఫిట్ నెస్ పై నివేదిక తీసుకుంటాం అని చెప్పారు.

 

ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్, యశస్వీ జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా. హర్షిత్ రాణా (ఇంగ్లాండ్ తో సిరీస్ కు మాత్రమే).