Champions Trophy 2025 : బీసీసీఐకి షాక్.. పాకిస్థాన్ మాట వినాల్సిందేనన్న ఐసీసీ.. ఇదేం ట్విస్ట్!
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ICC Responds As BCCI Says No To Pakistan name On Team India Champions Trophy jersey
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో పాక్‌కు వెళ్లేది లేదని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. అదే సమయంలో టీమ్ఇండియా తమ దేశంలో పర్యటించాల్సిందేనని మొదట్లో పట్టుబట్టింది పాకిస్థాన్. అయితే.. ఆ తరువాత ఐసీసీ బుజ్జగింపులతో మెట్టు దిగింది. హైబ్రిడ్ మోడ్‌కు అంగీకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచులు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. దీంతో వివాదం ముగిసిందని, ఈ టోర్నీకి ఎలాంటి ఆటంకాలు ఉండవని అంతా భావించారు.
అయితే.. ఇప్పుడు మరో వివాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమ్ఇండియా ప్లేయర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు ఉండడం పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ పేరును అంగీకరించమని ఐసీసీకి బీసీసీఐ చెప్పింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ పై ఐసీసీ మండిపడినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.
IND vs ENG 1st T20 : ప్రపంచ రికార్డు పై తెలుగోడి కన్ను.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేనా?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. మెగాటోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల జెర్సీ పై ఆ టోర్నీ పేరుతో పాటు ఆతిథ్య దేశం పేరు ఖచ్చితంగా ఉంటుంది. అయితే.. పాక్ పేరును టీమ్ఇండియా జెర్సీ పై ముద్రించేందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ ఆడే మ్యాచులు దుబాయ్ వేదికగానే జరుగుతాయి గనుక ఆతిథ్య దేశం పేరు అవసరం లేదని బీసీసీఐ అన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. దీనిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆటగాళ్ల జెర్సీపై టోర్నమెంట్ లోగో ముద్ర వేయడం ప్రతీ జట్టు యొక్క బాధ్యత. ప్రతి జట్టు ఈ నిబంధనను పాటించాలి. టీమ్ఇండియా జెర్సీపై, ప్లేయర్స్ కిట్ పై ఆతిథ్య దేశం పేరుతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ లోగో ఉండాలి. ఒకవేళ భారత్ దీనిని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని బీసీసీఐని ఐసీసీ హెచ్చరించినట్లు సదరు వార్తల సారాంశం.
IND vs ENG : బంపర్ ఆఫర్.. ఈ శనివారం మెట్రోలో ఉచిత ప్రయాణం..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఇక గ్రూపు దశలో తన చివరి మ్యాచ్‌ను భారత్ మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడనుంది.