Sai Kumar – Balakrishna : బాలయ్యని గుండెల మీద తన్నాలి.. నాకు టెన్షన్.. సీమ సింహం సినిమా అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

సీమ సింహం సినిమాలో ఫైట్ సీన్ గురించి సాయి కుమార్ మాట్లాడుతూ..

Sai Kumar – Balakrishna : బాలయ్యని గుండెల మీద తన్నాలి.. నాకు టెన్షన్.. సీమ సింహం సినిమా అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

Sai Kumar Comments on Fight Scene with Balakrisha in Seema Simham Movie

Updated On : January 24, 2025 / 11:59 AM IST

Sai Kumar – Balakrishna : చాలా మాది హీరోలకు రిస్కీ ఫైట్స్ లో డూప్ లు చేస్తారని తెలిసిందే. కానీ కొంతమంది హీరోలు మాత్రమే రిస్కీ షాట్స్ అయినా రియల్ గా చేస్తారు. అందులో బాలయ్య ఒకరు. ఇటీవల డాకు మహారాజ్ సినిమాలో కూడా బాలయ్య అన్ని ఫైట్స్ రియల్ గా చేశారని డైరెక్టర్ బాబీ చెప్పాడు. తాజాగా నటుడు సాయి కుమార్ ఓ ఇంటర్వ్యూలో సీమ సింహం సినిమాలో బాలయ్యతో ఫైట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

బాలకృష్ణ, సిమ్రాన్, రీమా సేన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సీమ సింహం సినిమా 2002లో రిలీజవ్వగా ఈ సినిమా పరాజయం పాలయింది. ఈ సినిమాలో సాయి కుమార్ నెగిటివ్ పాత్రలో నటించారు.

Also Read : 8 Vasantalu Teaser : అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ టీజర్ వచ్చేసింది.. బ్యూటిఫుల్ బ్రేకప్ స్టోరీ..?

సీమ సింహం సినిమాలో ఫైట్ సీన్ గురించి సాయి కుమార్ మాట్లాడుతూ.. సీమ సింహం సినిమా చేసేటప్పుడు నేను ఎన్టీఆర్, నువ్వు ఎస్వీఆర్ అనేవాడు. ఆ సినిమాలో ఒక షాట్ ఉంది. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బాలయ్య బాబుకి. నేను ఆయన గుండెల మీద తన్నాలి. ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ డూప్ ని తీసుకొచ్చారు. అరకు దగ్గర షూటింగ్ జరుగుతుంది. బాలయ్య బాబు కాస్త పక్కన కూర్చొని వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇక్కడ షాట్ కంపోజ్ చేస్తున్నారు. అది చూసి బాలయ్య బాబు మాస్టర్ ని ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. సాయి గారు మిమ్మల్ని కొడితే మీరు వెనక్కి వెళ్లి పడాలి, అది డూప్ తో చేస్తున్నాం అని చెప్పారు. దానికి బాలయ్య.. ఆయన కొడితే ఆయన పవర్ తెలియాలంటే నేనే చేయాలి, డూప్ వద్దు అని ఆయనే వచ్చారు. దాంతో నాకు టెన్షన్ మొదలయింది ఆయన గుండెల మీద కొట్టాలి అని. నేను కొట్టిన తర్వాత బ్యాక్ కి వెళ్లి పడింది కూడా ఆయనే చేశారు డూప్ లేకుండా. రియల్ గా చేస్తేనే థియేటర్ లో ఆ పవర్ తెలుస్తుంది అని అన్నారు. దీంతో సాయి కుమార్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also See : Samantha : సమంత లేటెస్ట్ క్యూట్ ఫోటోలు చూశారా?.. తన టీమ్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో..

మరోసారి బాలయ్యని అభినందిస్తున్నారు. ఫైట్ సీన్స్ డూప్ లేకుండా బాలయ్య చేస్తున్నారు అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాల విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టగా ఇటీవల సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి మరో విజయం సాధించారు. ఈ సినిమా ఇప్పటికే 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.