Saif Ali Khan : దేవర అప్డేట్.. సముద్ర జలాల్లోంచి భైరా వచ్చేశాడు..

ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

Saif Ali Khan : దేవర అప్డేట్.. సముద్ర జలాల్లోంచి భైరా వచ్చేశాడు..

Saif Ali Khan first look released from NTR Devara Movie

Updated On : August 16, 2023 / 2:05 PM IST

Saif Ali Khan :  RRR తర్వాత ఎన్టీఆర్(JR NTR) నుంచి రాబోతున్న సినిమా ‘దేవ‌ర‌'(Devara) అవ్వడంతో ఈ సినిమాపై భారీ ఆంచనాలు ఉన్నాయి. కొరటాల శివ(Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా దేవర సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ గా ఉంటుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పారు. సముద్రపు భూభాగాల్లో జరిగే కథ అని, ఇందులో మాస్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరగగా అందులో అన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

Samantha : సమంత ఇకపై కుర్ర హీరోలతోనే సినిమాలు చేస్తుందా? వన్ ఇయర్ బ్రేక్ తర్వాత సినిమాలకు ఇప్పట్నుంచే ప్లాన్??

నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు కావడంతో దేవర సినిమా నుంచి సైఫ్ ఫట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సైఫ్ క్యారెక్టర్ పేరు భైరా అని ప్రకటించారు. సముద్రం, అలలు మధ్య భైరాని చూపించడంతో ముందు నుంచి చెప్తున్నట్టే సముద్రం వద్ద జరిగే మాస్ కథ అని తెలుస్తుంది. సైఫ్ ని కొంచెం మాస్ గానే చూపించారు పోస్టర్ లో. మరి ఎన్టీఆర్ -సైఫ్ మధ్య పోరాట సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.