Adipurush : షూటింగ్ పూర్తి చేసిన సైఫ్ అలీ ఖాన్..
ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’ లో లంకేశ్వరుడిగా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేశారు..

Saif Ali Khan
Adipurush: దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ తో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. సీతగా కృతి సనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్, భీముడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.
Ali Reza wife : అలీ రెజా భార్య సీమంతం.. తరలి వచ్చిన తారలు..
పక్కా ప్లానింగ్‌తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన ఓం రౌత్ ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా సైఫ్ అలీ ఖాన్ తన పోర్షన్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేశారు. ఈ సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించి ఘనంగా సెండాఫ్ ఇచ్చింది ‘ఆదిపురుష్’ టీమ్.
Evaru Meelo Koteeswarulu : తారక్ షో లో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి..
ఇంత త్వరగా సైఫ్ షూటింగ్ పూర్తి చెయ్యడంతో ఇండస్ట్రీ వర్గాలవారు ఆశ్చర్యపోతున్నారు. మిగతా షూటింగ్ కూడా అనుకున్న సమాయానికి పూర్తి చేసి.. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడని ఒక గ్రాండ్ విజువల్ వండర్‌ను ‘ఆదిపురుష్’ రూపంలో 2022 ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
View this post on Instagram