Saif Alikhan Sara Alikhan : మొదటిసారి కలిసి నటించిన బాలీవుడ్ తండ్రి కూతుళ్లు.. సైఫ్, సారా..
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే జర హాట్కే జర బచ్కే సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. సైఫ్ అభిమానులు ఎప్పట్నుంచో సారా, సైఫ్ కలిసి నటిస్తే చూడాలని ఉందని అడుగుతున్నారు. తాజాగా ఆ కోరిక నెరవేరింది.

Saif Alikhan and Sara Alikhan work together for an Ad first Time
Saif Alikhan Sara Alikhan Ad : సినీ పరిశ్రమలో హీరోలు తమ కొడుకులు, కూతుళ్లతో కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటారు. అన్ని సినీ పరిశ్రమలలో వారసులు ఉంటారు. బాలీవుడ్ లో అయితే ప్రతి ఫ్యామిలిలో వారసులు ఉన్నారు. హీరోలు, హీరోయిన్స్ చాలా మంది తండ్రి, తల్లి వారసత్వాన్ని తీసుకొని సినీ పరిశ్రమలోకి వచ్చి సక్సెస్ అవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే జర హాట్కే జర బచ్కే సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. సైఫ్ అభిమానులు ఎప్పట్నుంచో సారా, సైఫ్ కలిసి నటిస్తే చూడాలని ఉందని అడుగుతున్నారు. తాజాగా ఆ కోరిక నెరవేరింది. అయితే అది సినిమాలో కాదు, ఓ యాడ్ కోసం.
సారా అలీఖాన్, సైఫ్ అలీఖాన్ కలిసి తాజాగా అకో ఇండియా కార్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి పలు యాడ్స్ చేశారు. ఈ బ్రాండ్ కి చేసిన ఓ రెండు యాడ్స్ ని తాజాగా సారా అలీఖాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తండ్రి కూతుళ్లు మొదటి సారి నటించడంతో ఈ యాడ్స్ బాగా వైరల్ గా మారాయి. అభిమానులు కూడా సైఫ్, సారాలు కలిసి నటించడం చూసి సంతోహిస్తున్నారు. దీంతో ఆ కంపెనీకి కూడా మంచి రీచ్ వస్తుంది.