Virataparvam : వెన్నెల నిజజీవిత పాత్ర ‘సరళ’ ఫ్యామిలీని కలిసిన విరాటపర్వం టీం.. ఎమోషనల్ అయిన సాయి పల్లవి..

విరాటపర్వం సినిమా నిజ జీవితంలో సరళ అనే ఓ అమ్మాయి పాత్ర నుంచి తీసుకొని రాసిన కథ అని డైరెక్టర్ గతంలోనే చెప్పారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ వెళ్లడంతో అక్కడే నివసిస్తున్న ఒరిజినల్ వెన్నెల క్యారెక్టర్.............

Sai Pallavi

Sai Pallavi :  రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా, నందితాదాస్, ప్రియమణి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. నక్సల్స్ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన విరాటపర్వం జూన్ 17న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ చుసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

సినిమా రిలీజ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుకని నిర్వహించారు. అయితే ఈ సినిమా నిజ జీవితంలో సరళ అనే ఓ అమ్మాయి పాత్ర నుంచి తీసుకొని రాసిన కథ అని డైరెక్టర్ గతంలోనే చెప్పారు. ఆ అమ్మాయి కాల్పుల్లో చనిపోతుంది. దీంతో సినిమాలో కూడా సాయి పల్లవి పాత్ర చనిపోతుంది అంతా భావిస్తున్నారు.

Ranbeer Kapoor : పెళ్లయ్యాక జీవితం ఏం మారలేదు.. ఆలియాతో పెళ్లిపై స్పందించిన రణబీర్..

విరాటపర్వం సినిమా అంతా ఓ అమ్మాయి చుట్టే తిరుగుతుందని, ఆ పాత్రని సాయి పల్లవి అద్భుతంగా పోషించిందని, సాయి పల్లవి ఈ సినిమాకి మెయిన్ లీడ్ అని, సాయి పల్లవి కోణంలోనే ఈ కథ నడుస్తుందని, ఒరిజినల్ గా జరిగిన కొన్ని పాత్రల నుంచి ఈ కథ రాశానని డైరెక్టర్ వేణు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ వెళ్లడంతో అక్కడే నివసిస్తున్న ఒరిజినల్ వెన్నెల క్యారెక్టర్ సరళ కుటుంబ సభ్యులను కలిశారు చిత్ర బృందం.

 

సాయి పల్లవి, రానా, డైరెక్టర్ వేణు సరళ కుటుంబ సభ్యులని కలవడంతో వారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. సరళ తల్లి సాయిపల్లవి తన కూతురు పాత్ర చేసిందని చాలా ఎమోషనల్ అయింది. సాయిపల్లవిని తన సొంత కూతురిలా చూసుకుంది. సాయి పల్లవిని పట్టుకొని ఏడ్చేసింది. సాయి పల్లవి వెళ్ళేటప్పుడు సరళ తల్లి తనకి చీరను బహుకరించింది. దీంతో వాళ్ళ ప్రేమని చూసి సాయి పల్లవి కూడా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.