Salaar Tickets : ‘సలార్’ అర్ధరాత్రి షో ఒక్కో టికెట్ 5000 వరకు.. భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ నిరసన.. టికెట్ రేట్లు పెంచేశారంటూ..

ఇప్పటికే గవర్నమెంట్ సలార్ కి టికెట్ రేట్ల పెంపుకి ఓకే చెప్పగా, థియేటర్స్ దగ్గర ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని, కొన్ని టికెట్స్ మాత్రమే ఇచ్చి ఇంకొన్ని బ్లాక్ లో అమ్ముతున్నారని వార్తలు వస్తున్నాయి.

Salaar Benefit Shows Ticket Prices Hike Fans Fires on Theaters

Salaar Tickets : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా part 1 సీజ్ ఫైర్ రేపు డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారీ హైప్ ఉండటంతో టికెట్స్ కోసం అందరూ ట్రై చేస్తున్నారు. కొన్ని థియేటర్స్ ఆన్లైన్ కి ఇవ్వకుండా థియేటర్స్ వద్దే అమ్ముకుంటున్నాయి.

అయితే ఇప్పటికే గవర్నమెంట్ సలార్ కి టికెట్ రేట్ల పెంపుకి ఓకే చెప్పగా, థియేటర్స్ దగ్గర ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని, కొన్ని టికెట్స్ మాత్రమే ఇచ్చి ఇంకొన్ని బ్లాక్ లో అమ్ముతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న చోట్ల, అర్ధరాత్రి షోలకు సలార్ ఒక్క టికెట్ ధర 2000 నుండి 5000 వరకు బ్లాక్ లో అమ్ముతున్నారని సమాచారం.

Also Read : Salaar Song : సలార్ నుంచి మరో కొత్త సాంగ్ రిలీజ్.. విన్నారా? ప్రతి గాథలో రాక్షసుడే..

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీనిపై పలు థియేటర్స్ వద్ద గొడవలు అవుతున్నాయి. ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో కూడా ఈ వివాదం నెలకొంది. సలార్ సినిమా టికెట్ల విషయంలో భీమవరంలో అభిమానులకు, థియేటర్ యాజమాన్యంకు వివాదం జరగడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి పలువురు వచ్చి సామన్యులకు అందుబాటులో లేకుండా ఇష్టానుసారం టికెట్లు రెట్లు పెంచడాన్ని అడ్డుకున్నారు. అధికారులు చర్యలు తీసుకోని ప్యాన్స్ అందరూ సినిమా చూసే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభాస్ సొంత ఊరు భీమవరంలోనే అభిమానులకు ఈ విధంగా నిరాశ కలిగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు భీమవరం అంతా ప్రభాస్ కటౌట్స్ తో నిండిపోయింది.