Prabhas : ఆయన విగ్రహం చూసి షాక్ అయిన ప్రభాస్.. ఎవరిది ఆ విగ్రహం..?

ప్రభాస్ ఒకరి విగ్రహం చూసి.. అది నిజంగా మనిషి అనుకోని ప్రభాస్ షాక్ అయ్యాడట. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది..?

Salaar star Prabhas shocked to see that statue

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్.. సలార్, కల్కి 2898 AD, మారుతి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒకరి విగ్రహం చూసి.. అది నిజంగా మనిషి అనుకోని ప్రభాస్ షాక్ అయ్యాడట. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది..?

ప్రభాస్ పెద్దనాన్న, టాలీవుడ్ సీనియర్ హీరో ‘కృష్ణంరాజు’ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ప్రభాస్ కుటుంబం చాలా బాధ పడింది. ప్రభాస్ కూడా పలు వేదికల పై పెద్దనాన్న లోటు గురించి మాట్లాడి తన బాధని వ్యక్తం చేశాడు. కృష్ణంరాజు భార్య శ్యామల దేవి.. కృష్ణంరాజు విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విషయం ప్రభాస్ కి తెలియదంట. ఆ విగ్రహం చూస్తుంటే కృష్ణంరాజుని నిజంగా చూస్తున్నట్లు ఉంది.

Also read : Tollywood Hero : ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

అలాంటి విగ్రహాన్ని ప్రభాస్ సడన్ చూసి షాక్ అయ్యాడట. ఒక ఐదు నిముషాలు పాటు ఆ విగ్రహానే చూస్తూ ఉండిపోయాడట. ఈ విషయాన్ని ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి స్వయంగా తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అదే వీడియోలో కృష్ణంరాజు విగ్రహాన్ని కూడా చూపించారు. మరి మీరుకూడా ఆ విగ్రహాన్ని ఒకసారి చూసేయండి.

ఇక సలార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నారు.