Tollywood Hero : ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..? ఇతని తండ్రి ఒక దర్శకుడు, అన్నయ ఏమో హీరో.

Tollywood Hero childhood photo his father is director and brother is hero
Tollywood Hero : టాలీవుడ్ ప్రస్తుతం యువ హీరోల సందడి ఎక్కువ కనిపిస్తుంది. కొత్త హీరోలు కూడా ఆడియన్స్ ముందుకు వచ్చి తమ నటనతో అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. అలా ఈమధ్య కాలంలో తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని అలరిస్తూ మంచి గురింపుని తెచ్చుకున్న హీరో చిన్నప్పటి ఫోటోనే పైన కనిపిస్తున్న పిక్. ఈ హీరో అన్నయ్య కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు. ఇక వీరి నాన్న.. ఒక స్టార్ డైరెక్టర్. ఒకసారి ఫోటోని జాగ్రత్తగా చూసి.. ఆ హీరో ఎవరో గుర్తు పెడతారేమో ట్రై చేయండి.
ఎవరో గుర్తు పట్టలేకపోతున్నారా..? అయితే ఆ చిన్నప్పటి ఫోటోలో ఉన్న కుర్రాడిని మాత్రం ఎక్కడో చూసినట్లు ఉంది కదా. అక్కినేని హీరో సుమంత్ నటించిన ‘గోల్కొండ హై స్కూల్’ సినిమాలో ఈ కుర్రాడు కూడా ప్రధాన పాత్ర పోషించాడు. అదే సినిమాలో ఈ కుర్రాడి అన్నయ్య మెయిన్ రోల్ చేశాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు మరెవరో కాదు.. సంగీత్ శోభన్, సంతోష్ శోభన్. ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు సంగీత్ శోభన్. వీరి ఫాదర్ ప్రభాస్ తో సూపర్ హిట్ మూవీ ‘వర్షం’ చేసిన ‘శోభన్’.

sangeeth shobhan

Santosh Shobhan
Also read : Ileana D’Cruz : కొడుకు కోసం ఇలియానా కోరిక.. ఆ బొమ్మని పెద్ద సైజులో చేసి ఇవ్వండి..
సంగీత్ శోభన్ ఇటీవల ‘మ్యాడ్’ అనే యూత్ ఫుల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ మూవీలో సంగీత్ కామిక్ టైమింగ్ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వస్తున్నాయి. ఇక ఈ నెలలోనే ‘ప్రేమ విమానం’ అనే మరో సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన రాబట్టుకున్నాయి. సంతోష్ కట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 13 నుంచి డైరెక్ట్ ఓటీటీ Zee5 లో ప్రీమియర్ కానుంది.