Salaar vs Dunki war continues at north theaters allotment
Salaar : ప్రభాస్ సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఇలా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారో లేదో.. అలా హౌస్ ఫుల్ చేసేశారు. ఇది ఇలా ఉంటే, ఈ చిత్రాన్ని ఆ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదంట. ఇందుకు కారణం షారుఖ్ ‘డంకీ’ వెర్సస్ ప్రభాస్ ‘సలార్’ అని తెలుస్తుంది.
ప్రముఖ ఐనాక్స్ థియేటర్స్ పివిఆర్, మిరాజ్ సంస్థలు నార్త్ లో సలార్ కి స్క్రీన్స్ కేటాయించడం లేదట. డంకీ స్క్రీన్స్ కేటాయిస్తూ సలార్ ని పూర్తిగా పక్కన పెట్టడానికి ట్రై చేస్తున్నారట. దీంతో సలార్ నిర్మాతలు సీరియస్ చెంది ఒక నిర్ణయం తీసుకున్నారట. సౌత్ లో కూడా సలార్ సినిమాని పివిఆర్, మిరాజ్ ఐనాక్స్ ల్లో రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకుందట. ఆ సంస్థలు నార్త్ లో సలార్ కి ఎప్పుడైతే సరైన స్క్రీన్స్ ఇస్తుందో అప్పుడే సౌత్ లో కూడా ఆ ఐనాక్స్ ల్లో రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
Also read : Eagle Trailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ వచ్చేసింది..
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి సలార్ నిర్మాతలు నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, టికెట్ బుకింగ్స్ లో సలార్ సినిమా డంకీ పై ఆధిక్యత చూపిస్తుంది. ప్రభాస్ గత సినిమా ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షారుఖ్ పఠాన్ మొదటి రోజు 60 కోట్లు, జవాన్ మొదటి రోజు 129 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఈసారి కూడా ప్రభాస్ అదే స్థాయి ఓపెనింగ్స్ అందుకొని షారుఖ్ మీద పైచేయి చూపిస్తాడా లేదా అనేది చూడాలి.