×
Ad

Battle Of Galwan: తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్ ఖాన్.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ అప్డేట్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓకే చేసిన కొత్త సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్(Battle Of Galwan)'. దర్శకుడు అపూర్వ లఖియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

salman khan Battle Of Galwan teaser update

Battle Of Galwan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్నాడు. రీసెంట్ గా ఆయన హీరోగా వచ్చిన సినిమా సికందర్. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయం పాలైంది. ఇక అప్పటి నుంచి సల్మాన్ కంబ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే సల్మాన్ ఓకే చేసిన కొత్త సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్(Battle Of Galwan)’. దర్శకుడు అపూర్వ లఖియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Avatar 3: అవతార్ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ డిజాస్టర్.. బ్రేకీవెన్ కూడా కష్టమే.. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

మిలిటరీ వార్ డ్రామా కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సల్మాన్ లుక్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ టీజర్ గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ మూవీ టీజర్ డిసెంబర్ 27న విడుదళ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.

ఇక బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ మూవీ కథ విషయానికి వస్తే, 2020లో భారతదేశం-చైనా సరిహద్దులో జరిగిన గల్వాన్ లోయ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏఈ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తెలంగాణ వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే, ఇది కూడా ఇప్పటివరకు రూమర్ గానే ఉంది. ఈ విషయంపై కూడా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే సౌత్ నుంచి, మరీ ముఖ్యంగా టాలీవుడ్ నుంచి కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.