Salman Khan : బాలీవుడ్ యువ హీరోలపై సల్మాన్ సీరియస్ కామెంట్స్..
బాలీవుడ్ లో చాలా మంది యువ హీరోలు ఉన్నారు, ఇంకా వస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ యువ హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Salman Khan (Photo : Twitter)
Salman Khan : అన్ని సినీ పరిశ్రమలలో కొత్త హీరోలు, యువ హీరో(Hero)లు ఎంతమంది వస్తున్నా ఇంకా సీనియర్ హీరోలు వాళ్లకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. 80, 90 దశకాల్లో ఎంట్రీ ఇచ్చిన హీరోలు కూడా ఇంకా యంగ్ గా ఉంటూ వరుసగా సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్(Bollywood) లో కూడా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్లంతా కూడా 50 ఏళ్ళు దాటుతున్నా ఇప్పటికి సూపర్ సక్సెస్ లు ఇస్తున్నారు.
బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న వాళ్లలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్ లు సీనియర్ స్టార్ హీరోలుగా ఉన్నారు. వీరంతా కూడా ఇప్పటికి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక బాలీవుడ్ లో చాలా మంది యువ హీరోలు ఉన్నారు, ఇంకా వస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ యువ హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Dasara Blockbuster Daawath : దసరా ధూమ్ ధామ్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ గ్యాలరీ..
సల్మాన్ ఖాన్ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొనగా ఈ ప్రెస్ మీట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పుడొచ్చే యువ హీరోలంతా చాలా ట్యాలెంటెడ్, కష్టపడి పనిచేస్తున్నారు. కానీ మేం అయిదుగురం మాత్రం అంత తేలిగ్గా వదిలేయము. నేను, షారుఖ్, అక్షయ్, అమీర్, అజయ్ మేము సినిమాలు చేస్తూనే ఉంటాం, అంత ఈజీగా వాళ్లకు వదలేయము. మేము సినిమాలు సక్సెస్ అయితేనే మా రెమ్యునరేషన్స్ పెంచాము. కానీ కొంతమంది హీరోలు ఇప్పుడు ఒకటి, రెండు సినిమాలకే రెమ్యునరేషన్స్ పెంచుతున్నారు, ఎందుకు అని అన్నారు. దీంతో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ యువ హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎవరైనా యువ హీరోలు స్పందిస్తారేమో చూడాలి.