Salman Khan : రష్మిక తండ్రికి ప్రాబ్లమ్ లేనప్పుడు మీకెందుకు.. ఆమె కూతురుతో కూడా నటిస్తా.. సల్మాన్ ఖాన్ కౌంటర్..

సల్మాన్ ఖాన్ - రష్మిక మీద కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి.

Salman Khan Counter to Trollers Who Commented on Age Gap Between Rashmika Mandanna and Salman

Salman Khan : సినిమాల్లో సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్స్ తో కలిసి నటిస్తారని తెలిసిందే. అన్ని సినీ పరిశ్రమలలో ఇది జరుగుతుంది. అయితే సినిమాని సినిమాలా చూడకుండా కొంతమంది హీరో – హీరోయిన్స్ మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ విమర్శిస్తారు. మన సీనియర్ హీరోలకు ఇప్పటికే ఇలాంటి విమర్శలు చాలా వచ్చాయి.

ఇప్పుడు సల్మాన్ ఖాన్ – రష్మిక మీద కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ – రష్మిక మందన్న కలిసి సికందర్ సినిమాలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కి ప్రస్తుతం 59 ఏళ్ళు కాగా రష్మికకు 28 ఏళ్ళు. వీరిద్దరి మధ్య 31 ఏళ్ళ గ్యాప్ ఉంది, వీళ్ళు ఎలా హీరో – హీరోయిన్స్ గా నటిస్తారు అంటూ పలువురు వీరిపై ట్రోల్స్ చేసారు.

Also Read : Narne Nithin – NTR : ఎన్టీఆర్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు.. ఆసక్తికర విషయం చెప్పిన ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్..

తాజాగా సికందర్ సినిమా ప్రమోషన్స్ లో సల్మాన్ ఖాన్ ఈ విషయంలో ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ ఈ విషయం పై మాట్లాడుతూ.. నాకు, హీరోయిన్ కి 31 ఏళ్ళ గ్యాప్ ఉందని కొంతమంది అంటున్నారు. నాతో నటించే హీరోయిన్ కి ఏ ప్రాబ్లమ్ లేదు, హీరోయిన్ ఫాదర్ కి ఏ ప్రాబ్లమ్ లేదు మరి మీకెందుకు. ఒకవేళ ఆమెకు పెళ్లయి ఆమెకు కూతురు ఉంటే, ఆమెతో కూడా పనిచేస్తాను ఆమె తల్లి ఒప్పుకుంటే అని ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చాడు. దీంతో సల్మాన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇక AR మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్, రష్మిక జంటగా తెరకెక్కిన సికందర్ సినిమా మార్చి 30న విడుదల కానుంది.