Narne Nithin – NTR : ఎన్టీఆర్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు.. ఆసక్తికర విషయం చెప్పిన ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్..
ఎన్టీఆర్ బామ్మర్ది కావడంతో నార్నె నితిన్ ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి.

Narne Nithin Revealed Interesting thing about NTR
Narne Nithin – NTR : ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సోదరుడు, ఎన్టీఆర్ బామ్మర్దిగా నార్నె నితిన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మ్యాడ్, ఆయ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నార్నె నితిన్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమాతో రాబోతున్నాడు. ఎన్టీఆర్ బామ్మర్ది కావడంతో నార్నె నితిన్ ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి.
మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా నార్నేనితిన్ సుమ అడ్డా షోకి వచ్చాడు. షోలో సుమ ఎన్టీఆర్ మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడారు అని అడగ్గా నార్నె నితిన్ సమాధానమిస్తూ.. ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను స్కూల్ కి పంపించేశారు. నాకు చెప్పలేదు, నాకు పెళ్లి చూపులు అని తెలీదు కూడా అసలు అని తెలిపారు. అప్పుడు తాను స్కూల్ ఏజ్ అని తెలిపాడు.
Also Read : Mahesh Babu : రాజమౌళి సినిమా లుక్ తో మహేష్ ఇంకో యాడ్.. ఇలా అయితే కష్టం అంటున్న ఫ్యాన్స్..
అలాగే.. హీరో అవుదాం అని చెప్పినప్పుడు ఓకే చెయ్యి కానీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని కూర్చోపెట్టి నీట్ గా చెప్పారు ఎన్టీఆర్ అని తెలిపాడు నార్నె నితిన్. దీంతో నార్నె నితిన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.