Mahesh Babu : రాజమౌళి సినిమా లుక్ తో మహేష్ ఇంకో యాడ్.. ఇలా అయితే కష్టం అంటున్న ఫ్యాన్స్..
మూడు రోజుల క్రితం మహేష్ చేసిన ఇంకో యాడ్ కూడా రిలీజ్ చేసారు.

Mahesh Babu Another Advertisement Released with Rajamouli Movie Look Fans Disappointed
Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒడిశా లోని కోరాపుట్ అడవుల్లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. షూట్ అయ్యాక వీరి ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. రాజమౌళి – మహేష్ సినిమా మొదలయిన దగ్గర్నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా షూట్ చేస్తున్నా కొన్ని లీక్స్ మాత్రం తప్పలేదు.
అయితే సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా హీరోలు లుక్ బయటకు రాదు, ఇంకో సినిమా ఏది ఒప్పుకోకూడదు, యాడ్స్ చేయకూడదు అని కండిషన్స్ ఉంటాయి. అయితే ఈ కండిషన్స్ అన్ని మహేష్ దగ్గర పనిచేయట్లేదేమో. ఇటీవల మహేష్ బాబు – మహేష్ కూతురు సితార కలిసి ఓ క్లాతింగ్ బ్రాండ్ కి యాడ్ చేసారు. అప్పుడే రాజమౌళి సినిమా నుంచి మహేష్ ఫుల్ లుక్ లీక్ అయిందని ఫ్యాన్స్ బాధపడ్డారు.
మూడు రోజుల క్రితం మహేష్ చేసిన ఇంకో యాడ్ కూడా రిలీజ్ చేసారు. మహేష్ – తమన్నా కలిసి ఓ ఏసీ కంపెనీకి చేసిన యాడ్ ని రిలీజ్ చేసారు. ఇందులో కూడా మహేష్ రాజమౌళి సినిమా లుక్ లోనే ఉన్నాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నాడు.
ఇలా సినిమా మొదలయిన రెండు షెడ్యూల్స్ కే రెండు యాడ్స్ లో మహేష్ లుక్స్ బయటకు వచ్చేస్తే సినిమా అయ్యేలోపు ఇంకెన్ని యాడ్స్ తో లుక్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈ సినిమాకు మహేష్ లుక్స్ లీక్ అవ్వాల్సిన పని లేదు. మహేష్ యాడ్స్ తో ఆయనే లుక్స్ బయట పెడుతున్నాడు అని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇప్పటికైనా మహేష్ ని కంట్రోల్ లో పెట్టాలని రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.
మహేష్ ఇలా అందరూ ఎదురుచూసే సినిమా లుక్ తో యాడ్స్ చేస్తే సినిమాలో ఆ లుక్ చూస్తే వచ్చే ఎగ్జైట్మెంట్ ఉండదు అని నిరాశ చెందుతున్నారు. మహేష్ వేరే సినిమాలు ఎలాగో చెయ్యడు కానీ ఇప్పటికైనా రాజమౌళి మహేష్ ని కంట్రోల్ చేసి సినిమా అయ్యేదాకా యాడ్స్ చేయనివ్వకుండా ఆపుతాడా చూడాలి.
రాజమౌళి సినిమా లుక్ తో మహేష్ కొత్త యాడ్ మీరు కూడా చూసేయండి..