Salman Khan : సోదరుడి పెళ్ళిలో సల్మాన్ ఖాన్ స్టెప్పులు.. వీడియో వైరల్..

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన సోదరుడు అర్బాజ్ ఖాన్ వివాహంలో స్టెప్పులు వేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

Salman Khan dance at his brother Arbaaz Khan marriage video viral

Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన పెళ్లి వార్త చెప్పడం ఏమో గాని, ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ మాత్రం తన రెండో పెళ్లి వార్తని ఆడియన్స్ కి తెలియజేశారు. నటుడు మరియు నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్.. 1998లో మలైకా అరోరాని పెళ్లి చేసుకున్నారు. అయితే విబేధాలు తలెత్తడంతో 2017లో విడాకులతో విడిపోయారు. ఇక అర్బాజ్ ఖాన్ కొంతకాలంగా ‘షురాఖాన్’ అనే మేకప్ ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆ వార్తలు నిజం చేస్తూ షురాఖాన్ ని వివాహం చేసుకున్నారు. సల్మాన్, అర్బాజ్ ఖాన్ సోదరి అయిన అర్పితాఖాన్ శర్మ నివాసంలో ఈ వివాహం జరిగింది. ఇక ఈ వివాహ వేడుకలో సల్మాన్ ఖాన్ కుటుంబమంతా పాల్గొని సందడి చేసింది. ఈక్రమంలోనే సల్మాన్ కూడా స్టెప్పులు వేసి సోదరుడి వివాహాన్ని ఎంజాయ్ చేశారు. ‘తేరే మస్త్ మస్త్ దో నైన్’ అనే పాటకి సల్మాన్ వేసిన స్టెప్పు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Salaar : తన పిల్లలని ‘సలార్’ చూడనివ్వడం లేదని.. థియేటర్ యాజమాన్యంతో గొడవపెట్టుకున్న తల్లి..

కాగా అర్బాజ్ ఖాన్, షురాఖాన్ ను మొదటిసారి ‘పాట్నా శుక్లా’ సెట్స్ లో కలిశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు షురాఖాన్ మేకప్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు చూసిన కొంతమంది నెటిజెన్స్.. సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి కామెంట్స్ చేస్తున్నారు. అయితే సల్మాన్ ఇటీవల తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఇక తన లైఫ్ లో పెళ్లి అనే మాట లేదని తేల్చి చెప్పేశారు.

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’, ‘టైగర్ 3’ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయాయి. కిసీకా భాయ్ కిసీకి జాన్ మూవీ తమిళ చిత్రం వీరంకి రీమేక్ వచ్చింది. టైగర్ 3 బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కి భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి.. అభిమానులను నిరాశ పరిచింది.