Salman Khan Katrina Kaif YRF Spy Universe Movie Tiger 3 Trailer Released
Tiger 3 Trailer : పఠాన్(Pathan) లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న స్పై మూవీ సల్మాన్ ఖాన్(Salman Khan) క్రేజీ ప్రాజెక్ట్.. టైగర్ 3(Tiger 3). YRF స్పై యూనివర్స్ లోనే ఈ సినిమా ఉండబోతుంది. సల్మాన్ టైగర్ 3 పై భారీ అంచనాలు ఉన్నాయి. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా టైగర్ 3 సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ ఒక సీక్రెట్ రా ఏజెంట్ అని, అతను తన దేశాన్ని, ఫ్యామిలీని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో అతను ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు ప్రచారం జరగడంతో తన నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది కథగా ఉండనున్నట్టు చూపించారు. ఇక ట్రైలర్ లోనే ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు చేసింది. అలాగే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం.
Also Read : Saindhav Teaser : ‘సైంధవ్’ టీజర్ రిలీజ్.. వెంకిమామ ఫుల్ యాక్షన్.. సైకోగా..
ఇప్పటికే టైగర్ 3 సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 12 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. YRF స్పై యూనివర్స్ లోని షారుఖ్ పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు టైగర్ 3 సినిమాలో కూడా షారుఖ్ గెస్ట్ అప్పిరెన్స్ ఇవ్వనున్నాడని సమాచారం. దీంతో సల్మాన్ అభిమానులే కాక బాలీవుడ్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంది.