Saindhav Teaser : ‘సైంధవ్’ టీజర్ రిలీజ్.. వెంకిమామ ఫుల్ యాక్షన్.. సైకోగా..
‘సైంధవ్’ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.

Venkatesh Saindhav Movie Teaser Released
Saindhav Teaser : హిట్ సినిమా ఫేం శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్(Venkatesh) తన 75వ సినిమాగా ‘సైంధవ్’తో రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ‘సైంధవ్’. ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.
టీజర్ లో.. వెంకటేష్, వాళ్ళ కూతురు, భార్య.. ఇలా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్న క్షణాలు చూపించి.. విలన్ టీం ఆయుధాలను అక్రమంగా తీసుకొస్తున్నారని, పిల్లలకు ఆయుధాలతో ట్రైనింగ్ ఇస్తున్నారని చూపించారు. వెంకటేష్ విలన్ ని హెచ్చరించినట్టు, అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ ని చూపించి మెప్పించారు. ఇక విలన్ గ్యాంగ్ వెంకటేష్ ని సైకో అనడం, వెంకటేష్ సైకోగా కనిపిస్తాడు అని.. ఇలా ఇంట్రెస్టింగ్ గా టీజర్ లోనే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి చూడాలి.
Also Read : Sreeleela : శ్రీలీల – అనిల్ రావిపూడి చుట్టాలంట.. శ్రీలీల అనిల్‌ని ఏమని పిలుస్తుందో తెలుసా?
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.