Salman Khan: సల్మాన్ ఖాన్‌కు కలిసొచ్చిన ఈద్.. ఎన్ని సినిమాలకు ఎంత వసూళ్లో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో రంజాన్ కానుకగా ఎన్ని సినిమాలను రిలీజ్ చేశాడు.. వాటికి తొలిరోజు ఎలాంటి వసూళ్లు వచ్చాయో తెలుసా..?

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు కలిసొచ్చిన ఈద్.. ఎన్ని సినిమాలకు ఎంత వసూళ్లో తెలుసా?

Salman Khan Movies Released On Eid And Their Collections

Updated On : April 22, 2023 / 1:31 PM IST

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే కేవలం బాలీవుడ్ జనాలు మాత్రమే కాకుండా సౌత్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అంత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరో, తన సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ముఖ్యంగా తన సినిమాను ఈద్ కానుకగా రిలీజ్ చేసేందుకే ఎక్కువ ఆసక్తిని చూపుతాడు. సల్మాన్ కెరీర్‌లో చాలా సినిమాలు ఈద్ కానుకగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

Salman Khan : రంజాన్ సెంటిమెంట్ సల్మాన్ కి కలిసొస్తుందా??

మరి సల్మాన్ కెరీర్‌లో ఈద్ కానుకగా వచ్చిన సినిమాలు ఏమిటి.. వాటికి తొలిరోజు ఎలాంటి వసూళ్లు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం. 2010లో సల్మాన్ నటించిన దబాంగ్ చిత్రానికి తొలిరోజు రూ.14.50 కోట్ల వసూళ్లు దక్కాయి. ఈ సినిమా సల్మాన్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2011లో బాడీగార్డ్ మూవీని ఈద్ కానుకగా రిలీజ్ చేయగా, రూ.21.60 కోట్లతో అదరగొట్టాడు ఈ హీరో. ఇక 2012లో ‘ఏక్ థా టైగర్’ మూవీని రంజాన్ కానుకగా రిలీజ్ చేస్తే, ఈ మూవీ ఏకంగా రూ.32.93 కోట్లు రాబట్టింది.

2014లో ‘కిక్’ సినిమా ఈద్ కానుకగా రాగా, రూ.26.40 తొలి రోజు వసూళ్లతో దుమ్ములేపింది. 2015లో భజరంగీ భాయిజాన్ రూ.27.50 కోట్లు.. 2016లో సుల్తాన్ మూవీ రూ.36.54 కోట్లతో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాయి. ఆ తరువాత ఏడాది 2017లో వచ్చిన ట్యూబ్‌లైట్ మూవీ కూడా రూ.21.15 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ సినిమా టోటల్ రన్‌లో డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇక 2018లో ‘రేస్ 3’ మూవీ ఈద్ కానుకగా రాగా, రూ.29.17 కోట్లు రాబట్టింది.

Salman Khan : తగ్గని హత్య బెదిరింపులు.. బులెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసిన సల్మాన్‌..

2019లో ‘భరత్’ అనే సినిమా సల్మాన్ కెరీర్‌లో రూ.42.30 కోట్ల బెస్ట్ ఓపెనింగ్స్‌ను అందుకుంది. ఇక 2023 ఈద్ కానుకగా రిలీజ్ అయిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ తొలిరోజున రూ.15.81 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇలా ఈద్ కానుకగా సల్మాన్ తన సినిమాలను రిలీజ్ చేయగా, హిట్-ఫ్లాప్‌తో సంబంధం లేకుండా తొలిరోజు ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఈ స్టార్ హీరో.