Salman Khan : చిరిగిన బూట్లతో సల్మాన్ ఖాన్.. సింప్లిసిటీని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్

తమ అభిమాన హీరో ఏం చేసినా అభిమానులు పాజిటివ్‌గానే తీసుకుంటారు. ఇష్టమైతే ఫాలో అయిపోతారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చిరిగిన బూట్లతో కనిపించారు. ఇదో కొత్త ట్రెండ్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

Salman Khan : చిరిగిన బూట్లతో సల్మాన్ ఖాన్.. సింప్లిసిటీని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్

Salman Khan

Updated On : November 24, 2023 / 1:57 PM IST

Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల విడుదలైన ‘టైగర్ 3’ సినిమా ప్రమోషన్  టైమ్‌లో చిరిగిన బూట్లతో కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు.

Pushpa 2 : అన్‌స్టాపబుల్ షోలో పుష్ప 2 స్టోరీ లీక్ చేసిన రణబీర్ కపూర్..!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే ట్రెండ్ సెట్టర్. ఆయన స్టైల్, డ్రెస్సింగ్, బ్రాస్ లెట్ అన్నీ ప్రత్యేకం. అయితే ఇటీవల సల్మాన్ వేసుకున్న షూస్ మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. టైగర్ 3 స్టార్ కత్రినా కైఫ్‌తో ఆ సినిమా ప్రమోషన్ కోసం వెళ్లిన సల్మాన్ బాగా పాతబడిన బూట్లు వేసుకుని కనిపించారు. చిరిగిన జీన్స్ ఫ్యాషన్ అని విన్నాం కానీ.. చిరిగిపోయిన బూట్లు వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు.

Aadi Keshava Review : ఆదికేశవ మూవీ రివ్యూ.. రుద్రకాళేశ్వరుడిగా వైష్ణవ్ ఊర మాస్..

‘టైగర్ 3’ ప్రమోషనల్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ బ్లాక్ షర్ట్, ప్యాంటు వేసుకున్నారు. అరిగిపోయిన నల్లని బూట్లతో కనిపించారు. బూట్లు చివరి భాగం చిరిగిపోయినట్లు కనిపించింది. వెంటనే ఆయన ధరించిన షూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే ‘రిలాక్స్ అబ్బాయిలు.. ఆయన కొత్త ఫ్యాషన్ తీసుకు వస్తున్నారు’ అంటూ కామెంట్ చేసారు. అంతేకాదు ఆయన సింప్లిసిటీని చెబుతోంది అంటూ పొగడ్తలు కురిపించారు. మనీష్ శర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘టైగర్ 3’ లో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లో 400.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)