Salman Khan: సల్మాన్ ‘రాధే’ థియేటర్ లో ఓటీటీలో ఒకేసారి
సల్మాన్ ఖాన్ సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే వారం ముందు నుంచే సందడి మొదలవుతుంది. ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి ఫ్యాన్స్ హంగామా చేస్తారు. కానీ కరోనా కారణంగా ఈ హంగామా అంతా మిస్ అవుతుంది.

Salman Khan Radhe Movie Release On May13
Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే వారం ముందు నుంచే సందడి మొదలవుతుంది. ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి ఫ్యాన్స్ హంగామా చేస్తారు. కానీ కరోనా కారణంగా ఈ హంగామా అంతా మిస్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ చిత్రం మే 13న ఇటు థియేటర్స్ లో అటు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. ఓటీటీ డీల్ దాదాపు రూ.230 కోట్లు ఉంటుందని బాలీవూడ్ టాక్.
గత ఏడాది కరోనా సమయంలో కూడా ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చింది. కానీ ముంబయ్ థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్ధనల మేరకు సల్మాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సినిమా పూర్తై ఆరునెలలు అవుతుంది.. దీంతో చిత్ర యూనిట్ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఒకేసారి ఓటీటీ, థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు.
అయితే సల్మాన్ కు అత్యధిక మార్కెట్ ఉన్న మహారాష్ట్రలో కరోనా కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. ఇక ఉత్తర, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ తో థియేటర్లు నడుపుతున్నారు. ఇదే ‘రాధే’ సినిమాను థియేటర్, ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం అయ్యుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.