రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అంటూ పాడాడు ఓ కవి.. రవి వర్మ కాంచని అందాలు.. కెమెరా కళ్లు కాంచాయి. మూగభావాలలో.. అనురాగ యోగాలై.. కావ్య కల్పనలే.. నీ దివ్య శిల్పాలై అంటూ రవివర్మ పెయింటింగ్‌ల గురించి గొప్పగా చెబుతారు కదా? వాటిని రీ క్రియేట్ చెయ్యలేరు అనేది కూడా అంతే వాస్తవం అయితే మన హీరోయిన్లను రవివర్మ గీసిన బొమ్మల్లా మార్చేశారు ఓ ఫోటో గ్రాఫర్.
జీ వెంకట్ అనే ఫోటో గ్రాఫర్ ఆ రవివర్మ అందాలను తన ప్రతిభతో రీ క్రియేట్ చేశారు. 19వ శాతాబ్ధంలో రవివర్మ అందించిన అందాలను రవివర్మ 2020 పేరుతో అందించారు. ఓ కేలండర్ కోసం వీరంతా రవివర్మ గీసిన బొమ్మాల్లా మారి ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రవి వర్మ గీసిన అందాల రూపంలో వారి ఫోటోలు చూడడానికి ఎంతో బాగున్నాయి.
నటి సుహాసిని అద్వర్యంలో సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌లు అచ్చం రవి వర్మ కుంచే నుంచి జాలువారిన అందాల మాదిరిగానే ఉన్నారు.
రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా సమంత..
Celeb Photographer @venketramg recreated Master Painter #RaviVarma ‘s magic with Actresses for his #CelebCalendar2020 #NAAM @Samanthaprabhu2 acing the look.. pic.twitter.com/FPbxjSajkp
— Ramesh Bala (@rameshlaus) February 4, 2020
రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా శృతిహాసన్…
రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా ఐశ్వర్య రాజేష్..
It was a fantastic experience working with G Venket Ram (@venketramg) and suhasini (@suhasinihasan) for recreating Ravi varma project for NAAM. So glad I could participate in such a meaningful project. pic.twitter.com/lPQoDKDcQD
— aishwarya rajessh (@aishu_dil) February 3, 2020
రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా రమ్య కృష్ణ..
రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా ఖుష్బూ సుందర్..
#Khusbu mam pic.twitter.com/KDsMaPqkjl
— ʂ?? ?????? (@saikalyan369) February 4, 2020
రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా మంచు లక్ష్మి..