Samantha: డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పిన సమంత.. ఆవిడ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. యశోద నిర్మాత!

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "యశోద". నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఇటీవల సమంత.. తను గత కొన్ని రోజులుగా ‘మయోసిటిస్’ అనే అరుదైన వ్యాధితో పడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై యశోద చిత్ర నిర్మాత నేడు సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడాడు.

Samantha: డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పిన సమంత.. ఆవిడ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. యశోద నిర్మాత!

Samantha do her dubbing in Yashoda under Doctor observations

Updated On : November 7, 2022 / 5:52 PM IST

Samantha: స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “యశోద”. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలోని సమంత యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికే హైలైట్ గా నిలవనున్నాయి అని చెబుతున్నారు మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేసాయి.

Samantha: అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంతకి అతడి మాటలు ధైర్యాన్ని ఇచ్చాయంట.. ఎవరా వ్యక్తి?

కాగా ఇటీవల సమంత.. తను గత కొన్ని రోజులుగా ‘మయోసిటిస్’ అనే అరుదైన వ్యాధితో పడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై యశోద చిత్ర నిర్మాత నేడు సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడాడు. “సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమయంలో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. ఆ పరిస్థిలో కూడా ఆమె తెలుగు డబ్బింగ్ పూర్తి చేసారు.

అయితే తమిళంలో చెప్పే టైమ్‌కు సమంత ఎనర్జీ లెవల్స్ పడిపోయిని. రిస్క్ చేయడం ఇష్టం లేక వేరే వాళ్లతో చెప్పించడానికి ప్రయత్నించాం. కానీ సమంత.. తమిళంలో తన వాయిస్ అందరికీ తెలుసని ఆవిడే చెప్పారు. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ సినిమా హిందీ దుబ్బింగ్ ని సింగర్ చిన్మయితో చెప్పించారు.