Samantha : ఓటీటీ అవార్డ్స్.. బాలీవుడ్ హీరోయిన్లను బీట్ చేసిన సమంత

తాజాగా దేశంలోని ఓటీటీలను ఆధారం చేసుకొని ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఉత్తమ నటుల జాబితాను రిలీజ్ చేశారు. ఓటిటి ప్లాట్ ఫామ్స్ రిలీజ్ చేసిన ఉత్తమ నటుల జాబితాలో సమంతకు..............

Samantha : ఓటీటీ అవార్డ్స్.. బాలీవుడ్ హీరోయిన్లను బీట్ చేసిన సమంత

Samantha

Updated On : December 31, 2021 / 3:55 PM IST

Samantha :   ఈ సంవత్సరం సమంత పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కెరీర్ పరంగా మాత్రం దూసుకుపోతోంది. ఈ సంవత్సరం ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చింది సామ్. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ రెండో సీజన్ లో రాజి పాత్రలో జీవించింది. ఈ పాత్రలో సమంతకి బాగా పేరు వచ్చింది. ఈ సిరీస్ తో సమంత బాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఈ పాత్రకు గాను సమంత చాలా అవార్డులు, రివార్డులు దక్కించుకుంది. గోవా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన ఫస్ట్ టాలీవుడ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది సమంత ఈ పాత్రతోనే.

తాజాగా దేశంలోని ఓటీటీ ప్లాట్ ఫామ్ లను ఆధారం చేసుకొని ఉత్తమ నటుల జాబితాను రిలీజ్ చేశారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రిలీజ్ చేసిన ఉత్తమ నటుల జాబితాలో సమంతకు నాలుగో స్థానం దక్కింది. మొదటి స్థానంలో మనోజ్ బాజ్ పాయ్, రెండవ స్థానంలో మనోజ్ త్రిపాఠి, మూడవ స్థానంలో నవాజుద్దీన్ సిద్దిఖీ నిలిచారు. ఈ రకంగా ఈ లిస్ట్ లో హీరోయిన్స్ పరంగా మొదటి స్థానం సంపాదించింది సమంత. ఈ లిస్ట్ లో బాలీవుడ్ హీరోయిన్స్ ని దాటి మరీ.. సమంత నాల్గవ స్థానం సంపాదించింది. ఇదంతా ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లోని రాజి పాత్ర వల్లే.

Movie Tickets: తెలంగాణలో సినిమాలు చూడం.. టిక్కెట్ల ధరలపై ప్రేక్షకులు ఆగ్రహం

అయితే ఓటీటీలలో హవా చూపించే రాధికా ఆప్టే ఈ లిస్ట్ లో ఐదవ స్థానంలో నిలిచింది. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ తో పాటు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వరుస ప్రాజెక్ట్స్ చేసే రాధికా ఆప్టేని కూడా వెనక్కి నెట్టేసి ఈ లిస్ట్ లో సమంత స్థానం సంపాదించడం విశేషం. దీంతో సమంత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.