Samantha - Naga Chaitanya
Samantha – Naga Chaitanya : సమంత – నాగచైతన్య ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు. సమంత – నాగచైతన్య జంటగా ఉన్నప్పుడు బ్యూటిఫుల్ కపుల్ అని, విడిపోయాక వాళ్ళ డైవర్స్ తో, ఆ తర్వాత సమంత – రాజ్ నిడిమోరు ప్రేమ వ్యవహారంతో, తర్వాత చైతు – శోభిత పెళ్లితో వైరల్ అవుతూనే వస్తున్నారు. ఇటీవలే డిసెంబర్ 1న రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోవడంతో గత నాలుగు రోజులుగా సమంత మరోసారి ట్రెండ్ అవుతుంది.(Samantha – Naga Chaitanya)
అయితే నేడు సమంత తో పాటు నాగచైతన్య – శోభిత కూడా ట్రెండ్ అవుతున్నారు. కారణం ఏంటి అనుకుంటున్నారా? సమంత ఇటీవలే రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోగా వారి పెళ్లి, పెళ్లి ఫొటోలతో వైరల్ అవుతుంది. నాగచైతన్య – శోభిత మాత్రం మొదటి పెళ్లి రోజుతో వైరల్ అవుతున్నారు. అవును ఇవాళ డిసెంబర్ 4 శోభిత – చైతు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. గత సంవత్సరం ఇదే రోజు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.
Also See : Samantha : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి.. పెళ్లి చీరలో సమంత సోలో ఫొటోలు చూశారా?
దీంతో నేడు ఉదయం నుంచి ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు చైతు – శోభితకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు చెప్తున్నారు. వీరి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. మొత్తానికి సమంత – నాగచైతన్య.. ఇద్దరూ వారి వారి జీవిత భాగస్వాములతో ఒకేసారి ట్రెండ్ అవ్వడం గమనార్హం.
సమంత నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాలో 2010లో కలిసి పనిచేసారు. ఆ పరిచయం స్నేహంగా మారింది. 2014 ఆటోనగర్ సూర్య సినిమా సమయంలో ప్రేమలో పడి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2 సమయంలో 2020లో రాజ్ – సమంతకు పరిచయం అయింది. అప్పటికి సమంత – నాగచైతన్య ఇంకా విడిపోలేదు. ఈ సిరీస్ సమయంలో రాజ్ – సమంత దగ్గరవ్వడం వల్లే నాగచైతన్య – సమంతకు విబేధాలు వచ్చాయని అప్పట్లో టాలీవుడ్ సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సెకండ్ సీజన్ 2021 జూన్ లో రిలీజ్ అవ్వగా చైతన్య – సమంత అక్టోబర్ 2021లో విడిపోయారు.
ఆ సిరీస్ వల్లే, రాజ్ కు సమంత దగ్గర అవ్వడం వల్లే విడిపోయారని, ఆ సిరీస్ సమయంలోనే రాజ్ – సమంతల పరిచయం ప్రేమగా మారిందని అప్పట్లో పలు వార్తలు వచ్చాయి. ఆ సిరిస్ తర్వాత నుంచి సమంత రెగ్యులర్ గా రాజ్ నిడిమోరుతో కలిసి కనిపిస్తుంది. ఆ రూమర్స్ కాస్త ఇప్పుడు పెళ్లితో నిజం చేసేసారు. ఇక సమంత పరిచయం అయ్యాకే రాజ్ కూడా 2022 లో తన భార్య శ్యామలీ కి విడాకులు ఇచ్చారు.
ఇక నాగచైతన్య సమంత తో విడిపోయాక షోయు రెస్టారెంట్ 2022 లో మొదలుపెట్టారు. ఆ రెస్టారెంట్ వల్ల సోషల్ మీడియాలో శోభిత నాగచైతన్యకు పరిచయం అయింది. వీరిద్దరికి ఫుడ్ కామన్ గా ఉండటంతో అలా శోభిత – చైతు కోజ్ అయ్యారు. వీరి పరిచయం ప్రేమగా మారి గత సంవత్సరం 2024 డిసెంబర్ 4 న పెళ్లి చేసుకున్నారు.