కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అక్కినేని నాగార్జున..
కింగ్ నాగార్జున ఆగస్టు 29న 60వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌లో గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు నాగ్. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అక్కినేని కోడలు సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మామ నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపుతూ.. పొగడ్తలతో ముంచెత్తింది. నాగార్జున స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘మామా.. మీతో పాటు మీపక్కన ఉన్నవాళ్లందరూ ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అది మీ గొప్పదనం.. మీరు వయస్సును కూడా ఓడించారు మామా.. హ్యాపీ బర్త్‌డే కింగ్ నాగ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Read Also : దీపావళికి సాండ్ కీ ఆంఖ్..
ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న మరో ఫోటోను కూడా షేర్ చేసింది సమంత.. సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి..