Samantha : సమంతకు నమ్మకం లేదా? కొత్త దర్శకుడిని కాదని తన ఫ్రెండ్ కి..

గతంలో సమంత మెయిన్ లీడ్ లో మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.(Samantha)

Samantha

Samantha : సమంత కొన్నాళ్ల క్రితం ఆరోగ్య సమస్యలు అంటూ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అడపాదడపా వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ బిజినెస్ ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇటీవల శుభం సినిమాని నిర్మాతగా నిర్మించడమే కాక ఆ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేసింది. కానీ ఆ సినిమా యావరేజ్ గా నిలవగా సమంత రోల్ మాత్రం మెప్పించలేకపోయింది.(Samantha)

గతంలో సమంత మెయిన్ లీడ్ లో మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని అనౌన్స్ చేస్తూ సమంత చీరకట్టుకొని గన్ పట్టుకొని ఉన్న ఓ మాస్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వలేదు.

Also Read : Sridevi Vijaykumar : ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోయిన్.. చీరలో ఎంత అందంగా ఉందో..

సమంత మా ఇంటి బంగారం సినిమా తనే నిర్మిస్తుంది. ఈ సినిమా కొత్త డైరెక్టర్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ ని తప్పించి తన ఫ్రెండ్ నందిని రెడ్డికి సినిమా అప్పగించింది సమంత. దీంతో నందిని రెడ్డి ఈ సినిమా స్క్రిప్ట్ మీద ప్రస్తుతం వర్క్ చేస్తుందని సమాచారం. మరి ఆ డైరెక్టర్ మీద నమ్మకం లేక తెప్పించిందా? లేక నందిని ఇంకా బెస్ట్ ఇస్తుందని తీసుకుందా సమంతకే తెలియాలి. నందిని రెడ్డి గతంలో సమంతతో ఓ బేబీ సినిమా చేసింది. ఇదే ఆమెకు చివరి హిట్ సినిమా.

దీంతో మా ఇంటి బంగారం సినిమా సమంత, నందిని రెడ్డి ఇద్దరికీ కీలకం. ఈ సినిమాతో ఇద్దరూ హిట్ కొట్టాల్సిందే. మరి ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి మరోసారి మ్యాజిక్ చేసి మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తారా చూడాలి. నందిని స్క్రిప్ట్ రెడీ చేశాకే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుందని సమాచారం.

Also Read : Nara Rohith : మొదటిసారి కాబోయే భార్యతో.. సినిమా ఈవెంట్లో పాల్గొన్న నారా రోహిత్.. ఫోటోలు వైరల్..