ఊ అంటావా.. ఊ ఊ అంటావా అంటూ.. పుష్పలో ఓ ఊపు ఊపేసిన సామ్.. మళ్లీ సీక్వెల్‌లోనూ సందడి చేయబోతోంది. ఉ, ఊహూలు కాదు.. కేక పుట్టించేందుకు సమంత రెడీ అవుతోందట. ఇంతకీ ఇది నిజమేనా.. నిజమే అయితే ఈసారి కూడా ఐటమ్ సాంగ్‌కే పరిమితం అవుతుందా.. అతిధిపాత్రలో మెరవబోతుందా.. పుష్ప2లో సమంత పాత్ర ఎలా ఉండబోతోంది… హ్యావ్ ఏ లుక్..
టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ.. పుష్ప 2. తగ్గేదే లే అని నార్త్‌ఇండియాతో గడ్డం సవరించుకునేలా చేసిన పుష్పకు సీక్వెల్‌గా ఇది రాబోతోంది. బన్నీకి నేషనల్ అవార్డు రావాడం.. ఆ తర్వాత అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ టీజర్ రిలీజ్ కావడం.. ఫింగర్ ప్రింట్‌తో ఓ పోస్టర్ హల్చల్ చేయడం.. అన్నీ కలిసి మూవీ మీద అంచనాలు పెంచేశాయ్. ఐతే ఈ క్రేజ్‌ను డబుల్ చేసేలా.. డబుల్ కిక్ ఇచ్చేలా ఓ న్యూస్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2లో మళ్లీ సమంత మెరబోతుందనే గాసిప్.. వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
గెస్ట్ రోల్‌లో సమంత?
డిసెంబర్ 6న పాన్ ఇండియా లెవల్‌లో పుష్ప2 రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ హాఫ్ లాక్ చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కొద్దీ.. మూవీకి సంబంధించి.. ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తున్నాయ్. పుష్ప పార్ట్ 1 ఊ అంటావా.. ఊహూ అంటావా మావా అంటూ అలరించిన సమంత.. మరోసారి స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందని తెలుస్తోంది. పార్ట్ వన్‌కు మించి ఫుల్ కిక్ ఇచ్చేలా స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు టాక్. సుక్కు మూవీస్‌లో ఐటమ్ సాంగ్స్ అంటే కేక పుట్టిస్తుంటాయ్. అలాంటి సాంగ్ ఒకటి.. పుష్ప 2లో ఉండబోతుందట.
ఈ స్పెషల్ సాంగ్ సమంతతో చేయిస్తే ఎలా ఉంటుందని యూనిట్ ఆలోచిస్తుందంటా. ఐతే మరో క్రేజీ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. సాంగ్‌కు మాత్రమే కాకుండా.. అలా గెస్ట్ రోల్‌లో సమంత మెరిస్తే ఎలా ఉంటుందని కూడా మూవీ టీమ్ ఫీల్ అవుతోందని టాక్. ఇక ఫ్యామిలీ మ్యాన్ తర్వాత.. సీటాడెల్‌తో సమంత బాలీవుడ్‌ను పలకరించబోతోంది. దీంతో పుష్ప 2లో సామ్ కనిపిస్తే.. చాలా ప్లస్ అవుతుందన్నది మూవీ టీమ్ ప్లాన్. ఇదే నిజం అయితే.. థియేటర్లలో జాతరే మరి.
Rewind : ‘రివైండ్’ మూవీ రివ్యూ.. ప్రేమ కోసం టైం ట్రావెల్ చేస్తే..