Samantha : బొద్దింకను చంపితే హీరో.. స‌మంత వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఎవ‌రిని ఉద్దేశించి..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో స‌మంత (Samantha) ఒక‌రు. గ‌త‌కొంత కాలంగా ఆమె మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతోంది. త‌న ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించింది.

Samantha : బొద్దింకను చంపితే హీరో.. స‌మంత వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఎవ‌రిని ఉద్దేశించి..?

Samantha Instagram story

Updated On : August 13, 2023 / 9:24 PM IST

Samantha Instagram story : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో స‌మంత (Samantha) ఒక‌రు. గ‌త‌కొంత కాలంగా ఆమె మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతోంది. త‌న ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో కొత్త సినిమాల‌ను అంగీక‌రించ‌డం లేదు. చేతిలో ఉన్న ప్రాజెక్టుల‌ను అన్నింటినీ పూర్తి చేసింది. సంవ‌త్స‌రం పాటు సినిమాల‌కు బ్రేక్ ఇస్తున్న‌ట్లు ఇటీవ‌లే ఆమె వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

సినిమాల నుంచి విరామం తీసుకున్న స‌మంత కొద్ది రోజులుగా త‌న స్నేహితుల‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తోంది. పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించ‌డంతో పాటు విదేశాలకు వెళ్లి ఆనందంగా గ‌డుపుతోంది. త్వ‌ర‌లోనే ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఏదీఏమైన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటిక‌ప్పుడు త‌న ఫోటోస్ షేర్ చేస్తుండ‌డంతో పాటు కొన్ని సార్లు ఫిలాస‌ఫీ కోట్స్ పెడుతుంటుంది.

Mr Pregnant : కుర్చీ మడతపెట్టి.. తాతతో మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ సోహైల్ ఇంటర్వ్యూ.. తాత ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి..

తాజాగా సామ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. బొద్దింక‌ను చంపితే హీరో అవుతారు. సీతాకోక చిలుక‌ను చంపితే విల‌న్ అవుతారు. నైతిక‌కు కూడా సౌంద‌ర్య ప్ర‌మాణాలు ఉన్నాయి. అంటూ స‌మంత రాసుకొచ్చింది. ఇది నెట్టింట వైర‌ల్‌గా మార‌గా ఆమె ఎవ‌రికి గురించి ఇలా చెప్పింది అంటూ ఆరా తీసే ప‌నిలో ప‌డ్డారు నెటీజ‌న్లు.

ఇదిలా ఉంటే.. స‌మంత న‌టించిన ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రంలోని పాటలు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. అంతేకాకుండా వరుణ్ ధావన్‌తో కలిసి బాలీవుడ్‌లో సిటాడెల్ రీమేక్ లో న‌టించింది స‌మంత‌. ఆమె పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి అయ్యింది.

Vishwak Sen : పెళ్లి పీటలు ఎక్కబోతున్న విశ్వక్ సేన్.. ఆగష్టు 15న.. పోస్టు వైరల్..!